ఉత్తరాఖండ్ లో 2,382 మంది  పోలీసులకు పాజిటివ్ 

ఉత్తరాఖండ్ లో 2,382 మంది  పోలీసులకు పాజిటివ్ 

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 2,382 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకగా..వీరిలో ఐదుగురు చనిపోయినట్లు ఆ రాష్ట్ర పోలీస్ శాఖ తెలిపింది. అయితే ఇందులో 93శాతంమంది  కరోనా సోకకముందే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపింది.పోలీసులు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యుల్లో 751 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు డీఐజీ నిలీష్ ఆనంద్ భర్నే తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ఐదుగురు జవాన్లు, వారి కుటుంబసభ్యుల్లో 64 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.

కరోనా సోకిన వారికి మెడికల ఆక్సిజన్,బెడ్స్, ప్లాస్మా అందించడానికి గత నెలలో ఉత్తరాఖండ్ పోలీస్ విభాగం మిషన్ హౌస్లా అనే ప్రత్యేక డ్రైవ్ ను ప్రారంభించిందన్నారు నిలీష్ ఆనంద్ భర్నే. ఇందులో భాగంగా ప్రజలకు సేవలందిస్తున్న క్రమంలో పోలీసులు కరోనా బారినపడ్డారని తెలిపారు. ఇన్ని సమస్యలున్నప్పటికీ పోలీస్ సిబ్బంది చాలా కష్టపడి పనిచేస్తున్నారని..తమ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. కాగా, మొదటి దశ కరోనా వేవ్ లో ఉత్తరాఖండ్ లో 1982 మంది పోలీసులకు కరోనా బారిన పడగా.. 8 మంది మరణించారు.