భద్రాచలంలో అంతర్​ రాష్ట్ర నాటకోత్సవాలు ఆరంభం

భద్రాచలంలో అంతర్​ రాష్ట్ర నాటకోత్సవాలు ఆరంభం

భద్రాచలం, వెలుగు : భద్రాచలం జూనియర్ కాలేజీ గ్రౌండ్​లో మంగళవారం భద్రాద్రి కళాభారతి ఆధ్వర్యంలో 23వ అంతర్రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ, ఐటీసీ పీఎస్​పీడీ, ఇతరుల సహకారంతో ఏటా ఈ సంబరాలు నిర్వహిస్తున్నారు. సౌజన్య కళాస్రవంతి ఉత్తరాంధ్ర వారి దేవరాగం నాటికను తొలిరోజు ప్రదర్శించారు.

రక్తసంబంధాలు, పేగుబంధాలు, అనుబంధాలు అనే మానవ సంబంధాలు, మనిషి సహజ లక్షణాలు వీటిన్నంటినీ మించిన బంధం మనిషి నుంచి మరో మనిషికి జన్మనిచ్చిన కణబంధం ఇది చాలా బలమైనని చెప్పడమే ఈ దేవరాగం నాటిక సారాంశం. ఈ నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతకుముందు చిన్నారులు కూచిపూడి నృత్య ప్రదర్శనలు భళా అన్పించాయి. రేలా రేలాఫేం జానపద గాయకుడు జానకిరావు పాటలు అలరించాయి.