భారత్ - పాక్ యుద్ధం.. ఇండియాలో మూసివేసిన ఎయిర్ పోర్టులివే..

భారత్ - పాక్  యుద్ధం..  ఇండియాలో మూసివేసిన  ఎయిర్ పోర్టులివే..

భారత్ పాక్ మధ్య  మే 8 రాత్రి నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత సరిహద్దు రాష్ట్రాలు పంజాబ్ ,రాజస్థాన్ లను టార్గెట్ చేసుకుని పాక్ దాడులో చేస్తోంది. ఓ వైపు సరిహద్దులు కాల్పులు జరుపుతూనే మరో వైపు డ్రోన్లు, మిసైల్స్ తో అటాక్ చేస్తుంది. అంతే ధీటుగా భారత్ బదులిస్తోంది. పాక్ డ్రోన్లను, మిసైల్స్ ను గాల్లోనే ధ్వంసం చేస్తోంది. పాకిస్తాన్ ను  కోలుకోలేని దెబ్బ కొడుతోంది. ఆర్థిక నష్టం మిగులుస్తోంది.

Also Read:-అమృతసర్​ లో మళ్లీ మోగిన సైరన్​.. ఇళ్లలోనుంచి బయటకు రావద్దని హెచ్చరికలు

ఈ క్రమంలోనే  అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే  సరిహద్దు రాష్ట్రాలను అలర్ట్ చేసింది. స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. పోలీసు అధికారులకు సెలవులు రద్దు చేసింది. ఉద్రిక్తతలు తగ్గే వరకు  ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. అలాగే ఎయిర్ పోర్టులను అప్రమత్తం చేసింది. 24 ఎయిర్ పోర్టులను పూర్తిగా మూసివేసింది. మే 8 సాయంత్రం నాటికి 24 ఎయిర్ పోర్టులు   మూసివేయబడ్డాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలియజేసింది .

భారత్ మూసివేసి ఎయిర్ పోర్టులు ఇవే..

  • చండీగఢ్
  • శ్రీనగర్
  • అమృత్‌సర్
  • లూధియానా
  • భుంటార్
  • కిషన్‌గఢ్
  • పాటియాలా
  • సిమ్లా
  • కాంగ్రా-గగ్గల్
  • భటిండా
  • జైసల్మేర్
  • జోధ్‌పూర్
  • బికనీర్
  • హల్వారా
  • పఠాన్‌కోట్
  • జమ్మూ
  • లేహ్
  • ముంద్రా
  • జామ్‌నగర్
  • హిరాసా (రాజ్‌కోట్)
  • పోర్బందర్
  • కేశోద్
  • కండ్ల
  • భుజ్