
ప్రారంభించిన బీజేపీ సీనియర్ నేత, మధ్య ప్రదేశ్ ఇన్ చార్జి మురళీధర్ రావు
మల్కాజిగిరి,వెలుగు: బీజేపీ రాష్ట్ర కన్వీనర్, ఎక్స్ సర్వీస్‌మెన్ గోపు రమణా రెడ్డి ఆధ్వర్యంలో మల్కాజిగిరిలో ఏర్పాటు చేసిన 24వ జన్ ఔషధి కేంద్రాన్ని గురువారం బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ఇన్ చార్జి మురళీ ధర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ తీసుకొచ్చిన భారతీయ జన్ ఔషధి పరియోజన స్కీమ్‌తో ఎన్నో ప్రయోజనాలున్నాయన్నారు. ఈ స్కీమ్ ప్రతి ఒక్కరికి చేరే విధంగా కార్యకర్తలు ప్రచారం చేయాలన్నారు.
ఇన్ని కేంద్రాలు ఏర్పాటు చేసి మంచి సర్వీస్ అందిస్తున్న గోపు రమణారెడ్డి దంపతులను శాలువాతో సత్కరించి అభినందించారు. జన్ ఔషధి కేంద్రాల నిర్వాహకులు గోపు రమణా రెడ్డి మాట్లాడుతూ.. జనాలు తక్కువ ధరకు మెడిసిన్స్ కొనుక్కుని డబ్బులు మిగిలినప్పుడు వారి మాటల్లో ఆనందం ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి కేంద్రాలు మరిన్ని ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ కేంద్రాల్లో దాదాపు 50 నుండి 90 శాతం అతి తక్కువ ధరలకే బీపీ, షుగర్ తో పాటు ఇతర వ్యాధులకు సంబంధించిన మెడిసిన్స్ దొరుకుతాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ మల్కాజిగిరి కన్వీనర్ సదానంద గౌడ్, బీజేపీ గౌతంనగర్ డివిజన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, మాజీ కన్వీనర్ శ్రీనివాస్ ముదిరాజ్, బీజేవైఎం మల్కాజిగిరి కన్వీనర్ చందు తదితరులు పాల్గొన్నారు.