25 అడుగుల కొండా లక్ష్మణ్ విగ్రహం పెట్టాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్​

 25 అడుగుల కొండా లక్ష్మణ్ విగ్రహం పెట్టాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్​

ముషీరాబాద్, వెలుగు: పదవులను తృణప్రాయంగా వదిలిపెట్టి బడుగుల రాజ్యాధికారం కోసం పరితపించిన అభినవ పూలే కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని దోమలగూడలోని కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం మాట్లాడుతూ..  కొండా లక్ష్మణ్ బాపూజీ స్మృతి వనం కోసం హైదరాబాద్​లో ఐదెకరాల స్థలం కేటాయించి, అందులో  25 అడుగుల విగ్రహం పెట్టాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాకు ఆయన పేరు పెట్టాలని కోరారు.