వరెస్ట్ సినిమా అన్నారు.. రూ.2 కోట్లతో తీస్తే.. రూ.15 కోట్లు వచ్చాయ్

వరెస్ట్ సినిమా అన్నారు.. రూ.2 కోట్లతో తీస్తే.. రూ.15 కోట్లు వచ్చాయ్

ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ సినిమాలు సరిగ్గా ఆడటం లేదు కానీ.. ఒకప్పుడు వర్మ సినిమాలంటే పిచ్చి క్రేజ్ ఉండేది.  శివ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ.. క్షణక్షణం, అంతం, గాయం సినిమాలతో ఇండస్ట్రీకి కొత్త తరహా సినిమాలను అందించారు. దీంతో వర్మ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఎక్కువగా  రియలిస్టిక్‌ సబ్జెక్టుతోనే సినిమాలు తీయడానికి ఇష్టపడుతుంటారు వర్మ. అలా 1998 జూలై 03న వర్మ డైరెక్షన్ లో సత్య అనే సినిమా అనే రిలీజై సంచలన విజయం అందుకుంది.  ఈ సినిమా రిలీజై 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.  

సత్య పాత్ర కోసం ముందుగా  మనోజ్‌ బాజ్‌పాయ్‌.. 

వర్మ మొదట యాక్షన్ సినిమా తీయాలని అనుకున్నారు. కానీ ఆయన కొంతమంది నేరాగాళ్లు, గ్యాంగ్‌స్టర్లపను కలిసిన తరువాత తన మనసును మార్చుకున్నారు. అంతా కొత్తవాళ్లతో సినిమాను ప్లాన్ చేశారు. అదే సత్య.  ముందుగా సత్య పాత్ర కోసం మనోజ్‌ బాజ్‌పాయ్‌ను అనుకున్నారు వర్మ . అయితే, స్క్రిప్ట్‌, పాత్రల పరంగా చూస్తే అతడికంటే కాస్త మంచి నటుడు కావాలనిపించింది. దీంతో శివ సినిమాలో చిన్న రోల్ చేసిన  జేడీ చక్రవర్తి వైపు వర్మ మొగ్గు చూపారు. అందుకు కారణం కూడా ఉంది. జేడీ అప్పటికే దక్షిణాదిలో మంచి నటుడిగా రాణిస్తున్నారు. హిందీ వాళ్లకు కొత్త. పైగా అతడు మాట్లాడే హిందీ ఉత్తరాది వాళ్ల యాసలో ఉండదు. దీంతో మనోజ్‌ బాజ్‌పాయ్‌ను సెకండ్‌ లీడ్‌ బీకూ మాత్రే కోసం ఎంపిక చేశారు. 

మనోజ్‌ బాజ్‌పాయ్‌కు జాతీయ అవార్డు

సత్య మిస్ అయినందుకు చాలా బాధపడ్దారు మనోజ్‌ బాజ్‌పాయ్‌.  బీకూ మాత్రే పాత్రను అయిష్టంగానే ఒప్పుకున్నారు. కానీ సినిమా రిలీజయ్యాక తన పాత్రకు వచ్చిన క్రేజ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట.  ఈ సినిమాకు గానూ ఆయన ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. బీకూ మాత్రేగా మరాఠీ యాసలో మాట్లాడేందుకు మనోజ్‌బాజ్‌పాయ్‌ తన వంట మనిషి దగ్గర శిక్షణ తీసుకున్నారు.  ఈ పాత్రకు సంబంధించిన బట్టలను కూడా స్వయంగా ఆయనే కొనుక్కొన్నారు.

 హీరోయిన్ గా ముందుగా మహిమా చౌదరి

ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా మహిమా చౌదరికి ఆఫర్  చేశారు వర్మ.. కానీ ఏమైందో ఏమో కానీ  రంగీలా సినిమా చేసిన ఊర్మిళను ఫైనల్ చేశారు.  

50 రోజుల్లోనే పూర్తి..  వరెస్ట్‌ సినిమా అన్నారు 

వర్మ కేవలం 50 రోజుల్లోనే ఈ సినిమాను తీశారు.  ఈ సినిమా ప్రివ్యూ వేస్తే హిందీ సినిమా చరిత్రలో దీనంతా వరెస్ట్‌ సినిమా మరోకటి లేదన్నారు.   రెండు వారాల పాటు ఎక్కడా కూడా టాక్‌ వినిపించలేదు.  కానీ ఆ తర్వాత నుంచి నెమ్మదిగా సినిమా ప్రేక్షకులకు నచ్చేసింది. అక్కడి నుంచి మళ్లీ  వెనక్కి తిరిగి చూసుకోలేదు. 

 రూ.2కోట్లతో తీస్తే  రూ.15కోట్లు

సత్య మూవీని ముందుగా  రూ.2కోట్లతో తీయాలనుకున్నారు వర్మ.  కానీ  మరో 50లక్షలు ఖర్చు అయింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద  ఏకంగా రూ.15కోట్లు వసూలు చేసింది. 

6 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు

ఈ సినిమాకు మొత్తం 6 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు వచ్చాయి. (ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ ఎడిటింగ్‌, ఉత్తమ సౌండ్‌ డిజైన్‌) .  నిజానికి ఈ సినిమాలో సాంగ్స్ లేకుండా ప్లాన్ చేశారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకోరన్న కారణంగా వర్మ తనదైన శైలిలో విశాల్ భరద్వాజ్ తో పాటలను కంపోజ్ చేయించాడు.  2008 ఆస్కార్‌ అవార్డు అందుకున్న స్లమ్‌డాగ్‌ మిలీయనీర్‌ చిత్రానికి సత్య ఒక స్ఫూర్తి అని ఆ చిత్ర దర్శకుడు డానీ బోయల్‌ స్వయంగా చెప్పాడం విశేషం.