'ఓ మై గాడ్ 2' (OMG 2) వంటి సూపర్ హిట్ చిత్రంలో బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అమిత్ రాయ్.. ఇప్పుడు మరో హార్ట్ టచింగ్ కథలో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. ఆయన డైరెక్షన్ లో రూపొందించిన చిత్రం ' ఓ మై డాగ్ ' ( Ohh My Dog) . లేటెస్ట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ జూలై 31న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు..
గూస్‌బంప్స్ టీజర్..
మనుషులకు, శునకాలకు మధ్య ఉండే అన్ కండిషనల్ లవ్ అండ్ లాయల్టీని ఈ టీజర్ లో అద్భుతంగా చూపించారు డైరెక్టర్. ఈ మూవీ కేవలం ఓ బాలుడు- కుక్క మధ్య ఉన్న అనుబంధం గురించే కాదు.. ప్రేమ, నమ్మకం, స్నేహం, కరుణ వంటి విలువలను గుర్తు చేసే భావోద్వేగ ప్రయాణమని అర్థమవుతోంది. టీజర్ ప్రారంభంలో వినిపించే అమితాబ్ బచ్చన్ క్లాసిక్ పాట 'మేరే పాస్ ఆవో మేరే దోస్తో' ప్రేక్షకులను చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తూ కథపై ఆసక్తిని పెంచుతుంది.
సినిమాలో 250 కి పైగా కుక్కలు
దర్శకుడు అమిత్ రాయ్ మాట్లాడుతూ.. కుక్కలు మనకు ఎలాంటి స్వార్థం లేకుండా స్వచ్ఛమైన ప్రేమను, విశ్వాసాన్ని నేర్పుతాయి. ఒక చిన్న పిల్లోడికి, ఒక కుక్కకు మధ్య ఉన్న బాండింగ్ మాత్రమే కాదు ఇది... ఈ భూమిపై ఉన్న ప్రతి ప్రాణితో మనం ఎంత ప్రేమగా, కరుణతో కలిసి జీవించాలో చెప్పే కథ. ఈసినిమా చూసిన తర్వాత జంతువులపై ప్రేక్షకులలో కొంచెం ప్రేమ పెరిగినా మా ప్రయత్నం సఫలమైనట్లే అని ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా కోసం ఏకంగా 250కి పైగా భిన్న జాతుల కుక్కలను ఉపయోగించినట్లు తెలిపారు.
టాప్ క్లాస్ కాస్టింగ్..
బాబూలాల్ బిస్కోప్, థింకింగ్ హ్యాట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై అమిత్ రాయ్, రాజేష్ భరద్వాజ్, సనా వార్సీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో మాహి రాయ్, పంకజ్ త్రిపాఠి, గీతా అగర్వాల్ శర్మ, రాజేష్ కుమార్, పవన్ మల్హోత్రా, సులక్షణ బారువా ముఖ్య పాత్రలు పోషించాయి. ఈ ఎమోషనల్ అండ్ ఎంటర్‌టైనింగ్ డ్రామా జూలై 31న థియేటర్లలో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
