మళ్లీ పిరమైన బంగారం 

మళ్లీ పిరమైన బంగారం 

బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. రెండ్రోజుల పాటు కాస్త తగ్గిన ధరలు మళ్లీ కలవరపెడుతున్నారు. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.57,490 పలుకుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 52,710గా ఉంది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడం ధర పెరిగేందుకు ప్రధాన కారణం తెలుస్తోంది. మరోవైపు ఆర్థిక మాంద్యం భయాలు గోల్డ్ రేట్ పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. డిమాండ్ ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో తులం బంగారం ధర రూ.60వేలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వ్యాపారులు అంటున్నారు. 

హైదరాబాద్ లో జనవరి 15వ తేదీన రూ.52,010గా ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం ధర 10 రోజుల్లో రూ.52,700లకు చేరింది. ఈ లెక్కన 10 రోజుల్లో 10 గ్రాముల గోల్డ్ పై రూ.690 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే జనవరి 15వ తేదీన రూ.56,740 ఉన్న బంగారం ధర, 10 రోజుల్లో రూ.57,490కు చేరింది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 రోజుల్లో రూ.750 మేర పెరిగింది.