పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో 11 రోజుల్లో రూ.2.68 కోట్లు పట్టివేత : సీపీ రెమా రాజేశ్వరి

పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో 11 రోజుల్లో రూ.2.68 కోట్లు పట్టివేత : సీపీ రెమా రాజేశ్వరి
  •     సీపీ రెమా రాజేశ్వరి

గోదావరిఖని, వెలుగు :  రామగుండం కమిషనరేట్​పరిధిలో పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని సీపీ రెమా రాజేశ్వరి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎలక్షన్​ కమిషన్​ ఆదేశాల మేరకు ఈ నెల 9 నుంచి 20 వరకు కమిషనరేట్​పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఏర్పాటు చేసిన చెక్‌‌‌‌పోస్టుల వద్ద ఆధారాల్లేకుండా తరలిస్తున్న రూ.2.68కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి చేసిన తనిఖీల్లో నగదుతోపాటు 78 గ్రాముల బంగారం, 42 కిలోల వెండి, 5.639 కిలోల గంజాయి, 3078 లీటర్ల మద్యం, 295 కిలోల పటిక, 1160 కిలోల బెల్లం పట్టుకున్నట్లు వివరించారు. 438 కేసుల్లో 1393 మందిని బైండోవర్ చేసినట్టు ప్రకటించారు. ప్రజలు, వ్యాపారులు సరైన పత్రాలను దగ్గర ఉంచుకోవాలని సీపీ రెమా రాజేశ్వరి సూచించారు.

జగిత్యాల జిల్లాలో రూ.15లక్షలు సీజ్​

జగిత్యాల టౌన్, వెలుగు : గత 24 గంటల్లో వాహన తనిఖీల్లో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రూ.15.67లక్షల నగదుతోపాటు 254 లీడర్ల లిక్కర్‌‌‌‌‌‌‌‌ను సీజ్​చేశామని ఎస్పీ సన్‌‌‌‌ప్రీత్ సింగ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వాటితో పాటు 200 చీరలు, వైట్ షర్ట్స్ 132, హ్యాండ్ బ్యాగ్స్ 40, హాట్ బాక్స్ 270..  స్వాధీనం చేసుకొని జిల్లా గ్రీవెన్స్ కమిటీకి అప్పగించినట్లు చెప్పారు. 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో రూ.1.32లక్షలు.. 

కరీంనగర్ క్రైం : కరీంనగర్‌‌‌‌‌‌‌‌ సిటీలోని తెలంగాణ చౌక్ వద్ద శుక్రవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.1.32లక్షలు పట్టుకున్నట్లు సీఐ రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు చెప్పారు. కరీంనగర్ మండలం గుంటూరుపల్లి గ్రామానికి చెందిన అనిల్ కుమార్ ఎలాంటి ఆధారాల్లేకుండా నగదు తీసుకెళ్తుండగా సీజ్​ చేసినట్లు చెప్పారు.