270  క్వింటాళ్ల  పీడీఎస్​ బియ్యం పట్టివేత

270  క్వింటాళ్ల  పీడీఎస్​ బియ్యం పట్టివేత

జోగిపేట, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న 270 క్వింటాళ్ల పీడీఎస్​ బియ్యాన్ని పట్టుకున్నట్లు పుల్కల్​ఎస్​ఐ క్రాంతికుమార్​ తెలిపారు. మంగళవారం ఉదయం శివ్వంపేట రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా లారీలో అక్రమంగా బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు.

లారీ డ్రైవర్​ కమ్​ ఓనర్​ రాజ్​భాయ్​ని  అదుపులోకి తీసుకొని విచారించగా హైదరాబాద్​ప్రాంతంలోని కాటేదాన్​ నుంచి గుజరాత్​ కు తరలిస్తున్నట్లు అంగీకరించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ తెలిపారు.