జెరూసలెం: ఇజ్రాయెల్ ఆర్కియాలజిస్టులు జెరూసలెంలో అరుదైన, అతి పురాతన మరుగుదొడ్డిని కనుగొన్నారు. ప్రస్తుత ఓల్డ్ జెరూసలెం సిటీలో బయల్పడిన ఈ టాయిలెట్‌ను సున్నపురాయితో దీర్ఘచతురస్రాకారంలో ఏర్పాటు చేసినట్లుగా గుర్తించారు. దాని కింద లోతైన సెప్టిక్‌ట్యాంక్ కూడా ఉంది. దీన్ని బట్టి చూస్తే 2700 ఏండ్ల కిందటే జెరూసలెంలో విలాసవంతమైన మరుగుదొడ్లు ఉండేవని తెలుస్తోందని, ఇలాంటి విలాసవంతమైన ప్రైవేట్ టాయిలెట్స్ఇప్పటి వరకు కొన్ని మాత్రమే బయటపడ్డాయని పురావస్తు తవ్వకాలకు నేతృత్వం వహించిన డైరెక్టర్ యాకోవ్ బిలిగ్ తెలిపారు. ‘ఆ కాలంలో ధనవంతులు మాత్రమే మరుగుదొడ్లను ఏర్పాటు చేసుకునేవారని, సెప్టిక్ ట్యాంక్‌లో గుర్తించిన జంతువుల ఎముకలు, కుండలను బట్టి అప్పటి వ్యక్తుల జీవనశైలి, ఆహారపు అలవాట్లను తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
