
పెషావర్: పాకిస్తాన్‌ను వరదలు వణికిస్తున్నాయి. నార్త్ వెస్ట్ పాకిస్తాన్‌లో ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఖైబర్ ఫఖ్తుంఖ్వ ప్రాంతంలో 12 మంది చనిపోయారు. కోహిస్టన్ జిల్లాలో బస్సు సింధు నదిలో పడటంతో ఆరుగురు చనిపోయారని, మరో 22 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. కరాచీలో శనివారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు 10 మంది చనిపోయారు. వారిలో ఇద్దరు మహిళలు, చిన్నారులు ఉన్నారు. కరాచీలోని చాలా ప్రాంతాల్లో కరెంట్ సప్లై లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కరాచీ – ఇంటీరియర్ సింధ్, బలుచిస్తాన్ హైవేపై వరద నీరు చేరటంతో రాకపోకలు బంద్ చేశారు. భారీ వరద నీరు వచ్చి చేరటంతో చిత్రాల్ జిల్లాలో జరుగుతున్న లోవారి టనెల్ పనులను నిలిపేశారు.