భారత్ లో 283 కు చేరిన కరోనా కేసులు

భారత్ లో 283 కు చేరిన కరోనా కేసులు

కరోనా మహమ్మారి రోజు రోజుకు ఉదృతం అవుతోంది. భారత్ ల కరోనా బాధితుల సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రిపోర్ట్ ప్రకారం ఇవాళ(21) సాయంత్రం 4.45 వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 283 కు చేరింది. దేశంలోని పలు ప్రాంతాల్లో  నమోదైన 35  కేసులతో కరోనా వైరస్ కేసులు ఇవాళ(21) 283 కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.  ఇప్పటి వరు భారత్ లో కరోనా వల్ల నలుగురు చనిపోయారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది. దీంతో ఆదివారం 24 గంటల కర్ఫ్యూకు తెలంగాణ పిలుపునిచ్చింది.

కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రదాని మోడీ ఆదివారం ఉదయం 6గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ప్యూకు పిలుపునిచ్చారు. వ్యక్తిగత దూరం  పాటించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్కూల్స్ , కాలేజీలు, షాపింగ్ మాల్స్, సినిమా థయేటర్లు, జిమ్‌లను మూసివేసాయి. 21న ఉదయం మేఘాలయలోని షిల్లాంగ్‌లో 24 గంటల కర్ఫ్యూ ప్రకటించారు.