
మహారాష్ట్ర ముంబైలోని KEM మెడికల్ కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది. ఆ మెడికల్ కాలేజీలోని 29 మంది MBBS విద్యార్థులు కరోనా బారినపడ్డారు. వారికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే.. ఇందులో 27 మంది రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. 29 మంది విద్యార్థుల్లో 23 మంది ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతుండగా.. ఆరుగురు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు. ఇందులో ఇద్దరు విద్యార్థులను చికిత్స కోసం సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. మిగిలిన వారందరినీ ఐసోలేషన్‌కు తరలించారు. KEM మెడికల్ కాలేజీలో మొత్తం 1100 మంది వైద్య విద్యార్థులు ఉన్నారని..ఆస్పత్రి డీన్ హేమంత్ దేశ్‌ముఖ్ తెలిపారు.