కెనరా బ్యాంక్‌‌‌‌లో 2 కిలోల గోల్డ్‌‌‌‌ మాయం

కెనరా బ్యాంక్‌‌‌‌లో 2 కిలోల గోల్డ్‌‌‌‌ మాయం
  • గోల్డ్ అప్రైజర్‌‌‌‌పై పోలీసులకు ఫిర్యాదు 
  • ములుగు జిల్లా రాజుపేట కెనరా బ్యాంక్‌‌‌‌లో ఘటన
  • ప్రజల నుంచి సైతం లక్షల్లో వసూలు చేసి ఉడాయించినట్లు ప్రచారం

మంగపేట, వెలుగు : ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట కెనరా బ్యాంక్‌‌‌‌లో ఖాతాదారులు తాకట్టు పెట్టిన గోల్డ్‌‌‌‌ మాయమైంది. బ్యాంక్‌‌‌‌లో గోల్డ్ అప్రైజర్‌‌‌‌గా పనిచేస్తున్న వ్యక్తే 2.117 కిలోల బంగారంతో ఉడాయించినట్లు గుర్తించిన బ్యాంక్‌‌‌‌ ఆఫీసర్లు మంగపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజుపేట కెనరా బ్యాంక్‌‌‌‌లో సమ్మెట ప్రశాంత్‌‌‌‌ అనే వ్యక్తి గోల్డ్‌‌‌‌ అప్రైజర్‌‌‌‌గా పనిచేస్తున్నాడు.ప్రజలు వివిధ అవసరాల కోసం బ్యాంక్‌‌‌‌లో తాకట్టు పెట్టే బంగారాన్ని పరీక్షించి, లోన్‌‌‌‌ మంజూరు చేస్తుంటాడు.

బ్యాంక్‌‌‌‌ ఆఫీసర్లు ఇటీవల వార్షిక తనిఖీ నిర్వహించగా సుమారు రూ. 1.44 కోట్ల విలువైన 2.117 కిలోల బంగారం కనిపించలేదు. దీంతో బ్యాంక్‌‌‌‌ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో వైపు ప్రశాంత్‌‌‌‌ గ్రామంలో పలువురి వద్ద నుంచి లక్షల రూపాయలు అప్పు చేసినట్లు సమాచారం.కొందరు ప్రామిసరీ నోట్లు రాసుకొని డబ్బులు ఇవ్వగా, మరికొందరు లక్షల్లో చేబదులు ఇచ్చారని, తనకు ఉన్న గోల్డ్‌‌‌‌ షాప్‌‌‌‌లో బంగారు ఆభరణాలకు సంబంధించి ప్రజల నుంచి అడ్వాన్స్‌‌‌‌లు సైతం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వారం రోజుల క్రితమే కుటుంబంతో సహా గ్రామం నుంచి వెళ్లిపోయినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. బ్యాంక్‌‌‌‌ ఆఫీసర్ల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్‌‌‌‌ చెప్పారు.