మూడు చింపాంజీ పిల్లల కిడ్నాప్​

మూడు చింపాంజీ పిల్లల కిడ్నాప్​

ఆఫ్రికన్​ కంట్రీ కాంగోలో ఘటన

కిన్షాసా(కాంగో): గాయపడ్డ చింపాజీని, దాని పిల్లలను కాపాడి సాంక్చురిలో చేర్పించారు అధికారులు.. అక్కడి నుంచి మూడు చింపాంజీ పిల్లలను కొంతమంది కిడ్నాప్​ చేశారు. ఆఫ్రికన్​ కంట్రీ డెమోక్రాటిక్​ రిపబ్లిక్​ ఆఫ్​ కాంగోలో జరిగిందీ ఘటన. దేశంలోని కాటాంగ సాంక్చురిలోకి ఈ నెల 9న కొంతమంది దుండగులు చొరబడ్డారు. చింపాంజీ పిల్లల్లో మూడింటిని తీసుకొని పారిపోయారు. ఆపై సాంక్చురి ఫౌండర్​ ఫ్రాంక్​ చాంతెరౌ భార్యకు మెసేజ్​ పెట్టారు. చింపాంజీ పిల్లలు కావాలంటే డబ్బులివ్వాలని, లేదంటే వాటిని చంపేస్తామని బెదిరించారు. అయితే, కిడ్నాపర్ల డిమాండ్లకు తలొగ్గేది లేదని చాంతెరౌ చెబుతున్నారు. వాళ్లడిగినంత డబ్బు తమ దగ్గర లేకపోవడం ఒక కారణమైతే, ఇప్పుడు డబ్బులు ఇస్తే ఇంకొన్ని రోజులకు వేరే జంతువులను ఎత్తుకెళ్లి ఇలాగే డబ్బులు డిమాండ్​ చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా డబ్బు కోసం జంతువులను కిడ్నాప్​ చేసిన ఘటన కాంగోలో ఇదే మొదటిదని చెప్పారు. చింపాంజీ పిల్లల కిడ్నాప్​పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.