3 మోడల్స్​ను ఆపేసిన టయోటా కంపెనీ

 3 మోడల్స్​ను ఆపేసిన టయోటా కంపెనీ

న్యూఢిల్లీ: డీజిల్ ఇంజన్లకు సంబంధించిన సర్టిఫికేషన్ ​టెస్టుల్లో అక్రమాలు బయటికి రావడంతో టయోటా కిర్లోస్కర్ మోటార్ దేశంలో తన మూడు మోడళ్లైన ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్, హైలక్స్‌‌‌‌‌‌‌‌ల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మూడు డీజిల్ ఇంజన్ మోడల్‌‌‌‌‌‌‌‌లలో హార్స్‌‌‌‌‌‌‌‌పవర్ ఔట్‌‌‌‌‌‌‌‌పుట్ సర్టిఫికేషన్ పరీక్షలలో అవకతవకలను కనుగొన్నామని కంపెనీ ప్రకటించింది.

భారతదేశంలో ఇటువంటి ఇంజన్లను ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్, హైలక్స్‌‌‌‌‌‌‌‌లో ఉపయోగిస్తారు. అయితే, టీకేఎం మూడు మోడళ్ల కోసం కొత్త ఆర్డర్‌‌‌‌‌‌‌‌లను తీసుకోవడం కొనసాగిస్తుంది. డెలివరీ  హామీ ఇచ్చిన వారికి ఈ పరిస్థితి గురించి వివరిస్తామని కంపెనీ పేర్కొంది.