హైదరాబాద్, వెలుగు: మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఈ నెల 16 నుంచి 19 మధ్య ఒకేసారి మూడు ఎక్స్‌పోలు హిమ్‌టెక్స్, ఇండియా ప్రాసెస్ ఎక్స్‌పో అండ్ కాన్ఫరెన్స్ (ఐపీఈసీ), ఎకో సస్టైన్ (ఈసీఓ) ఎక్స్‌పోలను హైదరాబాద్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్‌పోజిషన్స్ లిమిటెడ్ (హైటెక్స్) నిర్వహించనుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ మెషిన్ టూల్ అండ్ ఇంజనీరింగ్ ఎక్స్‌పోకు (హిమ్‌టెక్స్) ఇది 8వ ఎడిషన్.
ఈ ఈవెంట్‌లలో ఉత్పాదక రంగంలోని తాజా ఆవిష్కరణలను, అభివృద్ధిని ప్రదర్శించనున్నారు. హిమ్‌టెక్స్‌ను 10,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్వహిస్తుండగా, 14 రాష్ట్రాల నుంచి 225 మంది విజిటర్లు వస్తారని అంచనా. ఎకో సస్టెయిన్ ఎక్స్‌పోలో 8 రాష్ట్రాల నుంచి కంపెనీలు పాల్గొననున్నాయి. ఇండియా ప్రాసెస్ ఎక్స్‌పో అండ్ కాన్ఫరెన్స్‌లో రసాయన, ఔషధ, ఆహారం, పానీయాలు, చమురు వంటి వివిధ సెక్టార్లకు చెందిన కంపెనీలు పాల్గొననున్నాయి.