ఒక వ్యక్తి శాఖాహారం (వెజ్) ఫుడ్ ఆర్డర్ చేస్తే, దానికి బదులుగా మాంసాహారం (నాన్-వెజ్) వచ్చిందని ఫిర్యాదుతో స్విగ్గీ ఫుడ్ డెలివరీ సంస్థపై ప్రస్తుతం సోషల్ మీడియా విమర్శలు కురుస్తున్నాయి.
ముంబై రెయిన్స్ అనే ఒకతను సోషల్ మీడియా Xలో ఈ విషయాన్ని బయటపెట్టారు. బిల్లుపై అన్నీ వెజ్ ఐటమ్స్ అని స్పష్టంగా ఉన్నా, తనకు మాత్రం క్రిస్పీ చికెన్ ప్యాక్ డెలివరీ అయిందని ఫొటోలు షేర్ చేశారు. ఈ సమస్యపై అతను స్విగ్గీ కస్టమర్ కేర్‌తో మాట్లాడిన చాట్ స్క్రీన్‌షాట్‌ను కూడా పోస్ట్ చేశారు.
చాట్ ప్రకారం... కస్టమర్ వెంటనే దీనిపై స్విగ్గీని సంప్రదించారు. అయితే స్విగ్గీ కస్టమర్ కేర్ దీనిపై పూర్తిగా విచారిస్తామని చెప్పి, ఆ సమస్యను వేరే టీంకి పంపినట్లు తెలిపారు. దీనికి సుమారు 6-8 గంటలు పట్టొచ్చని, మా ఏజెంట్స్ ఇమెయిల్ ద్వారా సమాధానం ఇస్తారని స్విగ్గీ చెప్పింది.
తప్పుగా నాన్-వెజ్ డెలివరీ అయినా స్విగ్గీ వెంటనే డబ్బు వాపసు (రీఫండ్) గానీ, లేదా ఆర్డర్‌ను మార్చి ఇవ్వడం (రీప్లేస్‌మెంట్) గానీ చేయలేదని కస్టమర్ ఆరోపించారు. ఇది కేవలం పొరపాటు కాదని, కస్టమర్ కేర్ పూర్తిగా ఫెయిల్ అయిందని అతను ఆగ్రహం వ్యక్తం చేశారు.
►ALSO READ | ప్లాటినం జ్యువెలరీ దిగుమతులపై ఆంక్షలు.. ఎప్పటి వరకు అంటే..
ఒక వేళ బ్రాండ్‌లు సేవలకు డబ్బు తీసుకుంటున్నాయంటే, సర్వీస్ సరిగ్గా అందించాలి. ఇక్కడ బాధ్యత విషయంలో పెద్ద తేడా ఉంది అని అతను స్విగ్గీని ట్యాగ్ చేస్తూ అన్నారు. ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో, చాలా మంది మాకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని కామెంట్ చేశారు. ఒక యూజర్, స్విగ్గీ ఎక్కువగా టెంపరరీ అంటే సగం డబ్బులు మాత్రమే రీఫండ్ చేస్తుందని, స్విగ్గీ సర్వీస్ నాణ్యత తగ్గిపోతుందని చెప్పారు.
మరొకరు కస్టమర్ కేర్ ఏజెంట్లు రీఫండ్ ఇస్తామని చెప్పి, చివరికి రీఫండ్ చేయడం లేదనీ, దీనివల్ల కస్టమర్లు మళ్లీ మళ్లీ ఫిర్యాదు చేయాల్సి వస్తుందని అన్నారు. కొందరు ఏకంగా సపోర్ట్ ఏజెంట్‌తో మాట్లాడటమే కష్టంగా ఉంది అని, ఒకవేళ కనెక్ట్ అయినా ఆర్డర్‌ను క్యాన్సల్ చేయడం తప్ప వేరే పరిష్కారాలు ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు.
