బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష

బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ఐసీటీ)  కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని  షేక్ హసీనాను దోషీగా తేలుస్తూ ఆమెకు మరణశిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో  మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్ కు కూడా మరణశిక్ష విధించింది కోర్టు.

మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై షేక్ హసీనాపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.  వీటిపై విచారణ సందర్భంగా వాదనలు విన్న ఐసీటీ న్యాయస్థానం.. నవంబర్ 17న ఆమెను దోషిగా తేల్చింది. హసీనా తీరుపై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. 2024 లో జరిగిన విద్యార్థుల ఆందోళన సందర్బంగా ఆమె మానవత్వానికి మచ్చ.. అమాయకులను కాల్చి చంపాలని  ఆమె ఆదేశాలు జారీ చేశారని కోర్టు చెప్పింది.  అల్లర్లో  1400 మంది వరకు మరణించారని న్యాయమూర్తి వెల్లడించారు.

►ALSO READ | సౌదీ బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్‌ దిగ్ర్భాంతి.. సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

 2024 జూలై, ఆగస్ట్‎లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసనలను షేక్ హసీనా ఉక్కుపాదంతో ఎక్కడికక్కడ అణిచివేశారు. ఈ క్రమంలో అల్లర్లు చెలరేగి నిరసనకారులు, పోలీసులు మృతి చెందారు. అల్లర్లు తీవ్ర రూపం దాల్చడంతో బంగ్లాలో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. 

ప్రాణ భయంతో షేక్ హసీనా దేశం విడిచిపారిపోయింది. షేక్ హసీనాకు భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. 2024 జూలై, ఆగస్టులో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలను అప్పటి ప్రధాని షేక్ హసీనా క్రూరంగా రంగా అణివేశారని ఆమెతో పాటు అప్పటి నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై నేరారోపణలు నమోదయ్యాయి.  ఈ క్రమంలోనే   ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ విచారణ జరిపిషేక్ హసీనాను  దోషిగా తేల్చి.. ఆమెకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

హసీనా అప్పగింత

 హసీనా ఆగస్టు 4, 2024న బంగ్లాదేశ్ నుంచి  పారిపోయి భారతదేశంలోనే నివసిస్తున్నారు. కమల్ కూడా భారతదేశంలో ఆశ్రయం పొందారని భావిస్తున్నారు. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హసీనాను అప్పగించాలని కోరింది కానీ భారతదేశం ఇంకా స్పందించలేదు.