
ముంబైలోని బాంద్రా వర్లీ సీ లింక్‌లోని టోల్ ప్లాజా వద్ద నవంబర్ 9న రాత్రి వేగంగా వస్తున్న ఎస్‌యూవీ పలు వాహనాలను ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. రాత్రి 10.15 గంటల సమయంలో బాంద్రా వైపు వస్తున్న టయోటా ఇన్నోవా కారు టోల్‌పోస్టుకు 100 మీటర్ల ముందు మెర్సిడెస్‌ను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలం నుంచి పారిపోయే ప్రయత్నంలో, కారు టోల్ క్యూ వద్ద ఉన్న ఇతర వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు మృతి చెందినట్లు వారు తెలిపారు.
Also Read :-నామినేషన్ వేసిన బండారి లక్ష్మారెడ్డి
"ఢీకొన్న తర్వాత, కారు వేగంగా వెళ్లి టోల్ ప్లాజా వద్ద మరో రెండు మూడు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ఆరు వాహనాలు దెబ్బతిన్నాయి. తొమ్మిది మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఆరుగురిలో ఇద్దరు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని సీనియర్ పోలీసు అధికారి కృష్ణకాంత్ ఉపాధ్యాయ తెలిపారు. 5.6 కిలోమీటర్ల పొడవు, ఎనిమిది లేన్ల బాంద్రా-వర్లీ సీ లింక్ పశ్చిమ ముంబైలోని బాంద్రాను దక్షిణ ముంబైలోని వర్లీకి కలుపుతుంది. ఇటీవలి నెలల్లో ఈ ప్రాంతాల్లో అనేక ప్రమాదాలు జరుగుతుండడం గమనార్హం.