ఆహార పదార్థాలు కల్తీ చేసే వాళ్లను చూశాం.. కానీ కరెన్సీ నోట్లను, సర్టిఫికేట్లను కల్తీ.. అదేనండీ ఫేక్ వి తయారు చేసే వారిని చూశారా? దుండిగల్ పీఎస్ పరిధిలో ఈ దందా చేస్తున్న దుండగుల గుట్టు రట్టు చేశారు పోలీసులు. మేడ్చల్ డీసీపీ సందీప్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. సులభంగా డబ్బు సంపాదించాలని ముగ్గురు వ్యక్తులు అడ్డదారులు తొక్కారు. ఇందుకోసం ఫేక్ కరెన్సీ, సర్టిఫికేట్లు తయారు చేయడమే కరెక్ట్ అని భావించారు. ఇంకేముందీ పనుల్లో నిమగ్నమయిపోయారు.
సమాచారం అందుకున్న దుండిగల్ ఎస్ ఓ టీ పోలీసులు వాటిని తయారు చేస్తున్న ప్రాంతానికి వెళ్లారు. పట్టుబడ్డ ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి 111 ఫేక్ వంద రూపాయల నోట్లు, 34 నకిలీ సర్టిఫికేట్లు, అరకిలో ఎండు గంజాయి తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.