మంచినీళ్లు తాగేటప్పుడు చేసే మూడు తప్పులు ఇవే..

మంచినీళ్లు తాగేటప్పుడు చేసే మూడు తప్పులు ఇవే..

ప్రతి మనిషీ ఆరోగ్యంగా ఉండడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. ఇదిశరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా పోషకాలను సులభంగా గ్రహించేందుకు, ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలోనూ సహాయపడుతుంది. నీరు శరీర ఉష్ణోగ్రతను నియంచ్రించేందుకు, శరీరం నుంచి అనవసర ద్రవాలను బయటకు పంపడంలోనూ సహాయపడుతుంది. అంత ప్రాధాన్యత ఉన్న నీటిని తాగేటప్పుడు మనం సాధారణంగా చేసే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. వాటిని నివారించడం చాలా అవసరమని స్మార్ట్‌వేద పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లోని ఆయుర్వేద వెల్‌నెస్ పేజీ చెబుతోంది. నీటిని సేవించేటప్పుడు నివారించాల్సిన సాధారణంగా 3 తప్పులు చేస్తుంటామని ఓ నిపుణురాలు ఈ వీడియోలో వెల్లడించారు.

నీరు త్రాగేటప్పుడు నివారించవలసిన తప్పులు

సరైన ఆరోగ్యం కోసం ఆయుర్వేదంలో కొన్ని చేయవలసిన, చేయకూడనిని వాటిలో కొన్ని:

నీటిని వేగంగా తాగకూడదు

నీటిని ఫాస్టా్ గా తాగడం వల్ల శరీరం ఓ రకమైన మినీ షాక్‌కి గురవుతుంది. తత్ఫలితంగా కడుపులోని నరాలు ఒత్తిడికి గురవుతాయి. దీని వల్ల టాక్సిన్స్ విడుదల, ద్రవాల అసమతుల్యత కారణంగా అజీర్ణం పెరుగుతుంది. అందువల్ల సిప్ బై సిప్ నీరు త్రాగాలి.

భోజనానికి ముందు, తరువాత నీరు తాగడం

ఆయుర్వేదం ప్రకారం, భోజనానికి ముందు నీరు త్రాగడం వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది. భోజనం చేసిన తర్వాత నీరు త్రాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. అంతే కాదు ఇది కొన్నిసార్లు స్థూలకాయానికి దారి తీస్తుంది. నీరుకి, భోజనానికి మధ్య కనీసం 45 నిమిషాల గ్యాప్ ఉంచడం మంచిది.

ప్లాస్టిక్ బాటిల్ తో నీరు తాగడం

ప్లాస్టిక్ బాటిళ్లలో ఉన్న నీటిని తాగడం హానికరం. ఎందుకంటే ఎక్కువసేపు ప్లాస్టిక్  బాటిళ్లలో ఉన్న నీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది పురుషులలో తక్కువ స్పెర్మ్ కౌంట్, బాలికలలో యుక్తవయస్సు పైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.

https://www.instagram.com/reel/Cq0H1MjAAvb/?utm_source=ig_embed&ig_rid=c54a7618-93b9-483e-a711-5068b8b55b47