డాక్టర్ నిర్లక్ష్యం వల్ల 3 నెలల పసికందు మృతి

డాక్టర్ నిర్లక్ష్యం వల్ల 3 నెలల పసికందు మృతి

డాక్టర్ నిర్లక్ష్యం వల్ల 3 నెలల పసికందు మృతి చెందింది. అనారోగ్యం కారణంగా నిన్న(నవంబర్ 23) సాయంత్రం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో అమృత చిన్నపిల్లల ఆస్పత్రికి చేగూర్ గ్రామానికి చెందిన 3 నెలల పసికందును తీసుకొచ్చారు. 

హాస్పిటల్ లో వైద్యం చేసిన అనంతరం.. డాక్టర్ ఇచ్చిన మందులు వేసిన అరగంటలోనే పాప అపస్మారక స్థితికి వెళ్లింది. తిరిగి పాపను అమృత హాస్పిటల్ కు తీసుకు రాగా.. పాప హార్ట్ బీట్ నెమ్మదిగా ఉందని గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లామని సలహా ఇవ్వడంతో హుటాహుటిన షాద్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. 

అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. వైద్యుల నిర్లక్షం వల్లనే తమ పాప చనిపోయిందని, తల్లిదండ్రులు అర్ధరాత్రి హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి ఆందోళనను విరమింపచేసి కేసు నమోదు చేశారు. తరచు ఇలాంటి ఘటనలు జరుగుతున్నా వైద్యాధికారులు ప్రైవేట్ హస్పిటల్స్ పై సరైన చర్యలు తీసుకోవడం లేదని, ఇలాంటి అస్పత్రులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.