ఒడిశాలో భారీగా నకిలీ కరెన్సీ: 7 కోట్లకు పైగా స్వాధీనం

ఒడిశాలో భారీగా నకిలీ కరెన్సీ: 7 కోట్లకు పైగా స్వాధీనం

ఒడిశాలో భారీగా నకిలీ కరెన్సీ పట్టుకున్నారు పోలీసులు. కోరాపుట్ జిల్లాలో  7 కోట్ల 90 లక్షల రూపాయల విలువైన ఫేక్ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ కారులో 4 బ్యాగుల్లో తరలిస్తుండగా… పోలీసులు పట్టుకున్నారు. ఈ నకిలీ నోట్లను ఛత్తీస్ గఢ్ లోని రాయిపూర్ లో ప్రింట్ చేసినట్టు విచారణలో నిందితులు చెప్పారని పోలీసులు తెలిపారు. డబ్బుతో పాటు 5 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.