Nobel Prize 2025: ఫిజిక్స్ లో ముగ్గురికి నోబెల్

Nobel Prize 2025:  ఫిజిక్స్ లో ముగ్గురికి నోబెల్

ఫిజిక్స్ లో  2025 ఏడాదికి గానూ ముగ్గురికి నోబెల్ ప్రైజ్ లభించింది.  జాన్ క్లార్క్, మైఖేల్ డెవోరెట్, జాన్ మార్టినిస్ లు  నోబెల్ బహుమతిని గెలుచుకున్నట్లు  ది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లో మాక్రోస్కోపిక్ క్వాంటం, మెకానికల్ టన్నెలింగ్ , ఎనర్జీ క్వాంటైజేషన్   ఆవిష్కరణలకు గానూ వీరికి ఈ నోబెల్ వరించింది. 

డిసెంబర్ 10న ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా స్టాక్‌హోమ్‌లో జరిగే కార్యక్రమంలో స్వీడిష్ రాజు  నోబెల్ ప్రైజ్ లను ప్రదానం చేస్తారు, ఆ తర్వాత సిటీ హాల్‌లో విలాసవంతమైన విందు ఏర్పాటు చేస్తారు.

మరో వైపు మానవ రోగ నిరోధక వ్యవస్థ గుట్టు విప్పినందుకుగానూ 2025వ సంవత్సరానికి వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్​ పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన మేరీ ఇ. బ్రంకోవ్‌‌‌‌, ఫ్రెడ్‌‌‌‌ రామ్స్‌‌‌‌డెల్‌‌‌‌, జపాన్‌‌‌‌కు చెందిన సిమన్‌‌‌‌ సకగుచీని అవార్డుకు నోబెల్​ కమిటీ అక్టోబర్ 6న ఎంపిక చేశారు.