- కర్నాటకలోని గంగావతి సివిల్ కోర్టు తీర్పు
కొప్పళ: ఇజ్రాయెల్ పర్యటకురాలితో పాటు ఓ స్థానిక మహిళపై అత్యాచారానికి పాల్పడి మరో వ్యక్తిని హత్య చేసినందుకు ముగ్గురు దోషులకు కర్నాటకలోని గంగావతి సివిల్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసులో మల్లేష్ అలియాస్ హండి మల్ల, శరణబసవ, చైతన్య సాయిని దోషులుగా నిర్ధారించి తీర్పు వెలువరించింది. ఇజ్రాయెల్ మహిళ, బిభాస్(ఒడిశా), పంకజ్(మహారాష్ట్ర), డానియెల్ (అమెరికా) నిరుడు కర్నాటకలో పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు.
హాస్టల్ నడిపే ఓ మహిళా ఓనర్ మార్చి 7న వారిని సైట్ సీయింగ్కు తీసుకెళ్లారు. వారంతా గంగావతిలోని సనాపూర్లో ఉండగా.. దోషులు ముగ్గురూ వచ్చి వారితో గొడవపెట్టుకున్నారు. పంకజ్, బిభాస్, డానియెల్ను తుంగభద్ర కెనాల్లోకి తోశారు. బిభాస్కు ఈత రాకపోవడంతో అతను నీటిలో మునిగి చనిపోయాడు. వారు నీటిలో ఉండగా.. హాస్టల్ ఓనర్, ఇజ్రాయెల్ మహిళపై దుండగులు అత్యాచారం చేశారు.
