
నిజామాబాద్ లో నిన్న ఓ షాపింగ్ మాల్ దగ్గర కిడ్నాప్ అయిన మూడేళ్ల చిన్నారి ఆచూకీ ఇంకా దొరకలేదు. చిన్నారి కోసం పోలీసుల గాలిస్తున్నారు. నిజామాబాద్ లోని అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు పోలీస్ కమిషనర్. అటు సరిహద్దుల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
షాపింగ్ కోసం నిన్న మెట్ పల్లి నుంచి నిజామాబాద్ కు ఓ కుటుంబం వచ్చింది. బిల్లు చెల్లిస్తుండగా మూడేళ్ల హనీ మాయమైంది. షాపింగ్ మాల్ తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికినా దొరక్కపోవడంతో కూతురు కిడ్నాప్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. చిన్నారిని కొందరు మహిళలు తీసుకెళ్లినట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. పోలీసులు సీసీకెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.