అంకుర హాస్పిటల్ లో 30 రోజుల బాలుడికి హైరిస్క్ బ్రెయిన్ సర్జరీ

అంకుర హాస్పిటల్ లో 30 రోజుల బాలుడికి హైరిస్క్ బ్రెయిన్ సర్జరీ

ఖమ్మం టౌన్, వెలుగు : నెలలు తక్కువతో పుట్టి, బ్రెయిన్ లో నరాలు చిట్లిపోయి తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన 30 రోజుల బాలుడికి ఖమ్మం అంకుర హాస్పిటల్ లో అత్యాధునిక సాంకేతిక పరికరాలతో బ్రెయిన్ సర్జరీ చేశారు. ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ వరుణ్ జొన్నలగడ్డ నేతృత్వంలో ఎనస్థీషియన్ డాక్టర్ ఎం.కోటేశ్వరరావు, డాక్టర్ జ్యోత్స్న, పీడియాట్రిక్ ఇంటెన్స్​విస్ట్ డాక్టర్ అపర్ణ, డాక్టర్​ శ్వేత, డాక్టర్ రాకేశ్, డాక్టర్ జాకీర్ ఇందులో పాల్గొన్నారు.  

మధిర నియోజకవర్గానికి చెందిన బాలుడికి బ్రెయిన్ లో నరాలు చిట్లి తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతే  పేరెంట్స్​ ఖమ్మం, హైదరాబాద్, విజయవాడ తిరిగి ఆర్థిక సోమత లేక ఖమ్మంలోని అంకుర హాస్పిటల్  ను సంప్రదించారన్నారు. అంకుర హాస్పిటల్ వైద్యులు సర్జరీ చేసేందుకు ముందుకు వచ్చి తమ బిడ్డకు ప్రాణాలు కాపాడారని, హాస్పిటల్ కు రుణపడి ఉంటామని తల్లిదండ్రులు చెప్పారు.