కరోనా ఎఫెక్ట్ : భారత్‌ను సహాయం కోరుతున్న 30 దేశాలు

కరోనా ఎఫెక్ట్ : భారత్‌ను సహాయం కోరుతున్న 30 దేశాలు

కరోనా వైరస్‌ ధాటికి వణుకుతున్న ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్‌వైపు చూస్తున్నాయి. ఇతర దేశాలతో పోల్చుకుంటే కరోనా ఎఫెక్ట్ భారత్‌పై చూపినా.. చాలా వరకు కట్టడి చేయగలిగింది. వైరస్‌ వ్యాప్తి చెందకుండా భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అగ్రరాజ్యం అమెరికా కూడా ప్రశంసలు కురిపించింది. అయితే కరోనా వైరస్ కు ఇప్పటి వరకు విరుగుడు కనిపెట్టకపోవడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.  ఈ క్రమంలో భారత్‌లో మలేరియా నిరోధానికి వాడే హైడ్రాక్సీ‍ క్లోరోక్వీన్‌తో పాటు పారాసిట్‌మాల్‌ మెడిసిన్ ను కరోనా బాధితులకు అందిస్తున్నారు.

హైడ్రాక్సీ ‍ క్లోరోక్వీన్‌ మెడిసిన్‌ను తమకు కూడా ఎగుమతి చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత ప్రభుత్వానికి కోరారు. ప్రధాని మోడీకి ట్రంప్‌ స్వయంగా ఫోన్‌ చేసి.. ఈ మెడిసిన్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.

అమెరికాతో పాటు..సార్క్ దేశాలతో పాటు మరో 30 దేశాలు కూడా భారత్ సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. హైడ్రా​క్సీ ‍క్లోరోక్వీన్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి.. తమకు సహాయం చేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. దీంతో మానవతా దృక్పథం తో సరఫరా పై ఉన్న నిషేధాన్ని సడలించాలని నిర్ణయించింది భారత ప్రభుత్వం.