బడుల బంద్​తో ఇండియాకు 30 లక్షల కోట్ల నష్టం

బడుల బంద్​తో ఇండియాకు 30 లక్షల కోట్ల నష్టం

కరోనా ఎఫెక్టే కారణమన్న వరల్డ్​ బ్యాంకు

కరోనా ఎఫెక్ట్.. లాక్​డౌన్​ కారణంగా ఆరు నెలలుగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. స్టూడెంట్లంతా ఇండ్లకే పరిమితమయ్యారు. ఆన్​లైన్​ క్లాసులు నడుస్తున్నా వాటి ప్రభావం అంతంతే. స్మార్ట్​ ఫోన్ ఉన్న వారికే క్లాసులు అందుబాటులో ఉంటున్నాయి. మిగతా వారికి చదువు దూరమైంది. మరోవైపు కరోనా భయం, ఫైనాన్షియల్​గా పడిన దెబ్బతో చాలా మంది పేరెంట్స్​ పిల్లలను ఈ ఏడాది స్కూళ్లకు పంపించడానికే జంకుతున్నారు. మళ్లీ స్కూళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయనే దానిపై ఇప్పటికైతే క్లారిటీ లేదు. ఇలా స్కూళ్లన్నీ బంద్​ కావడంతో మన దేశానికి ఎంత నష్టం వాటిల్లుతుందో తెలుసా? దాదాపు 400 బిలియన్​ డాలర్లు. అంటే మన కరెన్సీలో 30 లక్షల కోట్లట. ఇదొక్కటే కాదు లెర్నింగ్​కు సంబంధించి కూడా స్టూడెంట్లు ఎంతో కోల్పోవాల్సి వస్తుందట. ఈ వివరాలను వరల్డ్​ బ్యాంక్​ తన తాజా రిపోర్ట్​ లో వెల్లడించింది. ‘‘బీటెన్​ ఆర్​ బ్రోకెన్? ఇన్​ఫార్మాలిటీ అండ్​ కొవిడ్​-19 ఇన్​ సౌత్​ ఏషియా”పేరుతో ఈ రిపోర్ట్​ను రిలీజ్​ చేసింది.

కరోనా మహమ్మారి కారణంగా గతంలో ఎన్నడూ చూడని ఆర్థిక సంక్షోభాన్ని సౌత్​ ఏషియా చూస్తోందని, ఆ రీజియన్​లోని కంట్రీలన్నింటికీ ఇబ్బందులు తప్పవని వరల్డ్​ బ్యాంక్​ తన నివేదికలో పేర్కొంది. సౌత్​ ఏషియా రీజియన్​లో స్కూళ్ల మూసివేత వల్ల 622 బిలియన్​ డాలర్లు (మన కరెన్సీలో 45 లక్షల కోట్లు) నష్టం జరుగుతుందని, కరోనా తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే ఇది 880 బిలియన్​ డాలర్ల(65 లక్షల కోట్ల) వరకూ పెరిగే చాన్స్​ ఉందని తెలిపింది. ‘‘సౌత్​ ఏషియాలోని అన్ని కంట్రీస్​ లో స్కూల్స్​ టెంపరరీగా క్లోజ్​ కావడం స్టూడెంట్లపై చాలా ప్రభావం చూపుతోంది. ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్​కు సంబంధించి దాదాపు 39 కోట్ల మంది స్టూడెంట్లు ఇండ్లకే పరిమితమయ్యారు. ఈ పరిణామాలతో లెర్నింగ్​కు సంబంధించి సంక్షోభం ఏర్పడుతుంది”అని వరల్డ్ బ్యాంక్​ స్పష్టం చేసింది. చాలా ప్రభుత్వాలు కరోనా ఎఫెక్ట్ ఎడ్యుకేషన్​పై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా.. రిమోట్​ లెర్నింగ్​లో స్టూడెంట్లను ఎంగేజ్​ చేయడం కష్టంగా మారుతోందని వివరించింది. ఇదే పరిస్థితి కొనసాగితే దాదాపు 55 లక్షల మందికిపైగా స్టూడెంట్లు ఎడ్యుకేషన్​ సిస్టంకు దూరమవుతారని, దీని వల్ల లెర్నింగ్​ లాసెస్​ పెరిగి.. ప్రొడక్టవిటీపై లైఫ్​ టైం ఇంపాక్ట్​ చూపుతుందని వెల్లడించింది.

నేర్చుకొనుడే కాదు.. నేర్చుకున్నదీ మర్చిపోతారు

కరోనా ఎఫెక్ట్​తో స్కూళ్లన్నీ మార్చి నుంచి మూత పడ్డాయి. కొన్ని దేశాలు ఇప్పటికే స్కూళ్లను ఓపెన్​ చేయగా.. మరికొన్ని ఓపెన్​ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. దాదాపు ఆరు నెలలుగా స్టూడెంట్లు స్కూళ్లకు దూరంగా ఉన్నారు. ఇంత కాలం స్కూళ్లకు వారంతా దూరం కావడం వల్ల కొత్త విషయాలను నేర్చుకోకపోవడమే కాక.. అప్పటి వరకూ తాము నేర్చుకున్న విషయాలను మర్చిపోయే అవకాశం ఉందని వరల్డ్​ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. దీని వల్ల ఈ రీజియన్​లో లెర్నింగ్ లాస్​ 0.5 ఇయర్స్ ఉంటుందని, లెర్నింగ్ అడ్జస్టెడ్​ ఇయర్స్​ ఆఫ్ స్కూలింగ్(ఎల్ఏవైఎస్) 6.5 నుంచి 6.0కి పడిపోతుందని, స్కూలింగ్​లో వచ్చిన సాంకేతిక మార్పుల్లో ఇది చాలా ఎక్కువ నష్టమని పేర్కొంది. చదువుకునే అవకాశాలు, లెర్నింగ్​ రిజల్ట్స్​ను కొలిచేందుకు వరల్డ్​ బ్యాంక్​ ఎల్ఏవైఎస్​ కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టింది. క్వాంటిటీ(ఎన్ని ఏండ్లు చదివారు), క్వాలిటీ(సంబంధిత గ్రేడ్​ లెవెల్​లో పిల్లలు ఎంత నేర్చుకున్నారు) అనే దానిని ఒకేసారి అంచనా వేయడం దీని ఉద్దేశం. ఈ పరిస్థితులను ఎదుర్కొన్న చిన్నారులు ఒకసారి లేబర్​ మార్కెట్​లోకి వచ్చిన తర్వాత జీవిత కాలంలో సగటున 4,400 డాలర్ల వరకూ లాస్ అవుతారని, మొత్తం రాబడిలో ఇది ఐదు శాతానికి సమానమని పేర్కొంది.

రీఓపెనింగ్​పై ఇప్పటికీ రాని క్లారిటీ

కరోనా మహమ్మారి కారణంగా మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లను కేంద్ర ప్రభుత్వం మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ ప్రకటించింది. ఐదు నెలల తర్వాత ఈ రూల్స్​ ను కొద్ది కొద్దిగా సడలించడం మొదలుపెట్టింది. జూన్​ 8 నుంచి అన్​లాక్​ ప్రక్రియను ప్రారంభించినా.. స్కూళ్లు, ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూట్లను తెరిచేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. తాజాగా రిలీజ్ చేసిన అన్​లాక్​ గైడ్​లైన్స్​లో కంటెయిన్​మెంట్​ జోన్లకు బయట ఉన్న స్కూళ్లు, కాలేజీలు, ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్లను ఈ నెల 15 నుంచి ఓపెన్​ చేయవచ్చని కేంద్రం ప్రకటించింది. అయితే స్కూళ్ల రీఓపెనింగ్​కు సంబంధించిన ఫైనల్​ డెసిషన్​ను మాత్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అప్పగించింది. దీంతో కొన్ని రాష్ట్రాలు రీఓపెనింగ్​కు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇంకా స్కూళ్ల మూసివేత కొనసాగుతోంది.

ఇండియాపైనే ఎక్కు వ ప్రభావం

సౌత్ ఏషియాలో ఎక్కువ లాస్ li ఎదుర్కొ నే దేశం ఇండియానే అని వరల్డ్​ బ్యాంకు స్పష్టం చేసింది. అన్ని దేశాలు తమ జీడీపీలో చెప్పుకోదగ్గ మొత్తంలోనే నష్టపోతాయని పేర్కొంది. ప్రస్తుతం సౌత్ ఏషియాలోని ప్రభుత్వాలు ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్ కోసం ఏటా 400 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నాయని వెల్లడించింది. ప్రస్తుతం స్కూళ్ల మూసివేత వల్ల వివిధ దేశాలు ఖర్చు చేస్తున్న మొత్తానికంటే ఎక్కువ నష్టపోతాయని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా 3.7 కోట్ల మంది ఇప్పటి వరకూ కరోనా బారిన పడగా.. 10.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే ఇండియా విషయానికి వస్తే 71 లక్షల కేసులు నమోదవ్వగా.. 1.09 లక్షల మంది వైరస్ కు బలయ్యారు.