డబ్బుకు తగ్గేదేలా: స్టాక్ మార్కెట్ లోకి కొత్తగా 30 లక్షల మంది

డబ్బుకు తగ్గేదేలా: స్టాక్ మార్కెట్ లోకి కొత్తగా 30 లక్షల మంది

అవును నిజమే.. స్టాక్ మార్కెట్‌లో చాలా బోలెడంత డబ్బు సంపాదించొచ్చు. కాకపోతే ఎంత వేగంగా లాభాలు వస్తాయో! అంతే వేగంగా నష్టాలు రావొచ్చు! ఇదీ నిజమే. రాంగ్ స్టాక్‌ను ఎంచుకుంటే పెట్టిన డబ్బు పోగొట్టుకోకతప్పదు. అయితే ఈమధ్య కాలంలో స్టాక్ మార్కెట్‌లో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరుగుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. 

ఒక్క 2023 జూలై నెలలోనే 30 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు తెరవబడ్డాయి. ఈ సంఖ్య గతేడాది 12 నెలల సగటు(20 లక్షలు)తో పోలిస్తే దాదాపు 50 శాతం ఎక్కువ. ఈ కొత్త ఖాతాలు కలుపుకుంటే.. మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 2.35 కోట్ల గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
 
రిస్క్ ఎక్కువైనప్పటికీ.. ఈక్విటీ మార్కెట్‌పై పెట్టుబడిదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని ఈ  లెక్కల ద్వారా తెలిసిపోతోంది. వీరిలో స్టాక్ మార్కెట్ మెళుకువలు తెలుకోవాలని వచ్చేవారు కొందరైతే, భారీగా డబ్బు పోగేయాలని చూస్తున్నవారు మరికొందరు.