ఎక్సర్‌సైజ్ చేస్తే రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ ఫ్రీ: వీడియో

ఎక్సర్‌సైజ్ చేస్తే రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ ఫ్రీ: వీడియో

కాసేపు అలా చిన్న ఎక్సర్‌సైజ్ చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం.. డబ్బులకు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. ‘ఫిట్ ఇండియా’ క్యాంపెయిన్‌లో భాగంగా స్క్వాట్ ఎక్సర్‌సైజ్‌కి ఇండియన్ రైల్వే చిరు నజరానా ఇస్తోంది. 30 స్క్వాట్స్ (గుంజీలు) తీస్తే ప్లాట్‌ఫామ్ టికెట్ ఫ్రీగా ఆఫర్ చేస్తోంది. ‘స్క్వాట్ కియోస్కీ’ పేరుతో మెసీన్లు పెట్టి.. దాని ద్వారా ఆటోమేటిక్‌గా టికెట్ వచ్చేలా అరేంజ్ చేసింది. తొలి విడతలో భాగంగా ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో దీనిని ప్రారంభించింది.

‘ఫిట్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రమోట్ చేయడంలో భాగంగా స్క్వాట్ కియోస్కీని ప్రారంభించినట్లు చెప్పారు ఇండియన్ రైల్వేస్టేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ ఎస్కే లోహియా. మూడు నిమిషాల్లోపు 30 స్క్వాట్స్ (గుంజీలు) తీస్తే ప్లాట్‌ఫామ్ టికెట్ ఫ్రీగా వచ్చేలా మెషీన్‌ని ప్రోగ్రామ్ చేశామన్నారు. దీనిని ప్రారంభించిన సందర్భంగా ఆయన గుంజీలు తీసి ఫ్రీ టికెట్ అందుకోని చూపించారు. దీనిని ట్రై చేసి చూసేందుకు యువత ఆసక్తిగా క్యూ కట్టడం విశేషం.