
హాలిడేస్ వచ్చాయంటే చాలు.. ఎంజాయి మెంట్ డేస్.. గతంలో స్కూళ్లకు సెలవులు వచ్చాయంటే చాలు ఎక్కడకు వెళ్లాలా అని ప్లాన్ వేసుకుంటారు. ఫ్రెండ్స్ అందరూ కలిసి ట్యాంక్ బండ్... గోల్కొండ పోర్ట్... బిర్లామందిర్... జూ పార్క్ ఇలా రక రకాల ప్రదేశాలకు వెళ్లి ఎంజాయి చేస్తుంటారు. వరుస సెలవుల కారణంగా జ్యూపార్క్ సందడిగా మారింది. ఆదివారం ( డిసెంబర్ 24) ఒక్కరోజే దాదాపు 30 వేల మంది హైదరాబాద్ లోని జూపార్క్‌ను సందర్శకులు వీక్షించారు.
వరుస సెలవుల కారణంగా డిసెంబర్ 24 జూపార్కుకు సందర్శకుల పెరుగింది. గతంలో శని, ఆదివారాల్లో మాత్రమే రద్దీ కనిపించేది. ప్రస్తుతం స్కూళ్లకు సెలవులు ఉండటంతో పేరెంట్స్ తమ పిల్లలను జూపార్కుకు తీసుకొస్తున్నారు. మాములు రోజుల్లోనూ పార్కును విజిట్ చేసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోందంటూ జూ అధికారులు చెప్తున్నారు. శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 10 వేలకు పైగానే ఉందంటున్నారు. డిసెంబర్ 24 ఆదివారం మాత్రం 30 వేల మంది సందర్శులకు వచ్చారని జూ పార్క్ అధికారులు తెలిపారు. సిటీతో పాటు శివారు ప్రాంతాల నుంచి జనాలు రావడంతో పార్కు లోపల సందర్శకులకు ఇబ్బంది కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.