రాష్ట్రం కోసం బలిదానాలు చేసిన వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి

రాష్ట్రం కోసం బలిదానాలు చేసిన వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి
  • కేసీఆర్ పాలనలో రాష్ట్రం దోపిడీకి గురవుతోంది
  • బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 13 వందల మంది బలిదానాలు చేసినవారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ బీఎస్పీ చీఫ్ కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని ప్రజలకు వివరిస్తామన్నారు ఆయన. తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న సంతోషం ఏ ఒక్కరిలో లేకుండా పోయిందని.. రాష్ట్రంలో 33 లక్షల మంది నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం రోడ్లపై ఎదురుచూస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్  పాలనలో రాష్టం దోపిడీకి గురైందని మండిపడ్డారు.  పూలే, అంబేద్కర్, కాన్షీరామ్, మాయావతిల స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో ఊరూరు.. పల్లె పల్లెకు.. గడప గడపకు 5 వేల కిలోమీటర్లతో యాత్ర చేస్తామన్నారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.

 

 

ఇవి కూడా చదవండి

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ ఇప్పుడు..

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

ప్రతిపక్షాల అవకాశాలను ప్రభుత్వం దెబ్బకొడుతోంది

ఈ కిచెన్ లో రోజుకు 18 వేల మందికి వంట చేయొచ్చు