ప్రతిపక్షాల అవకాశాలను ప్రభుత్వం దెబ్బకొడుతోంది

ప్రతిపక్షాల అవకాశాలను  ప్రభుత్వం దెబ్బకొడుతోంది
  • ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది
  • కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

సభాపతి నియంతృత్వంలా వ్యవహరిస్తున్నారని, గవర్నర్ ప్రసంగం లేకపోతే ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశాన్ని ప్రతిపక్షాలు  కోల్పోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం రద్దు గవర్నర్ కి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అంశంగా చూడటం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాల అవకాశాలను దెబ్బకొట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే నిరుద్యోగ భృతి, గిరిజన, మైనార్టీ రిజర్వేషన్లు అమలు పై ఒత్తిడి తీసుకురావాలన్నారు. దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం ఏకపక్షంగా టీఆరెస్ నాయకులకే అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం దళితబంధు పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను ప్రతిబింబించేలా అసెంబ్లీలో కాంగ్రెస్ పాత్ర ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 

 

ఇవి కూడా చదవండి

మరో న్యూక్లియర్ ప్లాంట్ దిశగా కదులుతున్న రష్యా దళాలు

 

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ ఇప్పుడు..

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఇండియన్స్‌కు అలెర్ట్