- ఉమ్మడి జిల్లాలో 3,525 నామినేషన్లు
- సంగారెడ్డి జిల్లాలో 2,202
- మెదక్ జిల్లాలో 668
- సిద్దిపేట జిల్లాలో 655
- ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట, వెలుగు: మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు అధికారులు నామినేషన్లను స్వీకరించారు. పోటీదారులు తమ బలాలు చూపించుకునేందుకు బ్యాండ్ మేళాలు, మద్దతుదారులతో భారీ ర్యాలీలు నిర్వహించి నామినేషన్లు వేశారు. కొందరైతే ఎడ్లబండ్లు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీల పరిధిలో 403 వార్డులకు ఎన్నికలు నిర్వహించనుండగా మూడు రోజుల్లో మొత్తం 3,525 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వార్డుల వారీగా టికెట్లు ప్రకటిస్తున్నప్పటికీ ఆశవాహులు మాత్రం ఓకే వార్డు ఒకే పార్టీ నుంచి నలుగురు, ఐదుగురు చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో మొత్తం 2,202 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 11 మున్సిపాలిటీలు, 256 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో 394 నామినేషన్లు వేయగా, కాంగ్రెస్ 135, బీఆర్ఎస్ 157, బీజేపీ 94, బీఎస్పీ 2, ఆప్ 1, ఎంఐఎం 5, సీపీఎం 1, రికగ్నైజ్ పార్టీ 2, ఇతరులు 125, సదాశివపేటలో 224 దాఖలు కాగా కాంగ్రెస్ 80, బీఆర్ఎస్ 65, బీజేపీ 37, సీపీఎం 2, ఎంఐఎం 9, జనసేన 3, ఇతరులు 28, జహీరాబాద్ లో 399 నామినేషన్లు వేయగా కాంగ్రెస్ 163, బీఆర్ఎస్ 104, బీజేపీ 49, సీపీఐ 2, ఎంఐఎం 3, ఎంఐఎం 22, ఏఏపీ 2, జనసేన 2, ఏఐఎఫ్ బీ 1, టీఆర్ఏపీ 1, బీఎస్పీ 1, ఇతరులు 49, కోహిర్ లో 144 నామినేషన్లలో కాంగ్రెస్ 43, బీఆర్ఎస్ 41, బీజేపీ 5, ఎంఐఎం 12, నారాయణఖేడ్ లో 153 మంది వేయగా, కాంగ్రెస్ 80, బీఆర్ఎస్ 36, బీజేపీ 25, సీపీఐ 2, ఎంఐఎం 4, బీఎస్పీ 1, ఇతరులు 5, జిన్నారంలో 166 నామినేషన్లు పడగా, కాంగ్రెస్ 50, బీఆర్ఎస్ 55, బీజేపీ 35, సీపీఎం 1, టీఆర్పీ 2, ఇతరులు 24, గడ్డపోతారం మున్సిపాలిటీలో 168 నామినేషన్లు పడగా, కాంగ్రెస్ 44, బీఆర్ఎస్ 62, బీజేపీ 32, బీఎస్పీ 3, జనసేన 1, ఫార్వర్డ్ బ్లాక్ 1, స్వతంత్రులు 25, గుమ్మడిదలలో 169 నామినేషన్లు వేగా కాంగ్రెస్ 68, బీఆర్ఎస్ 46, బీజేపీ 27, టీఆర్పీ 3, ఇతరులు 23, ఇంద్రేశం మున్సిపాలిటీలో 166 నామినేషన్లు వేయగా, కాంగ్రెస్ 57, బీఆర్ఎస్ 56, బీజేపీ 32, ఇతరులు 21, అందోల్-జోగిపేటలో 219 మంది నామినేషన్లు ఇవ్వగా, కాంగ్రెస్ 78, బీఆర్ఎస్ 57, బీజేపీ 61, ఇతరులు 23, ఇస్నాపూర్ మున్సిపాలిటీలో రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుండడంతో కమిషనర్ జాబితా ప్రకటించలేదు.
మెదక్ జిల్లాలో..
మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో మొత్తం 75 వార్డు కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా మూడు రోజుల్లో కలిపి మొత్తం 668 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ నుంచి 202, బీఆర్ ఎస్ నుంచి 209, బీజేపీ నుంచి 134, బీఎస్పీ నుంచి 10, ఏఐఎంఐఎం నుంచి 9, ఇండిపెండెట్లు 91, వివిధ పార్టీల నుంచి 13 నామినేషన్లు దాఖలు చేశారు. మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులకు మొత్తం 271 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో బీఆర్ఎస్ నుంచి 91, కాంగ్రెస్ నుంచి 89, బీజేపీ నుంచి 47, బీఎస్పీ నుంచి 7, ఏఐఎంఐఎం నుంచి 8, ఇండిపెండెంట్లు 29 నామినేషన్లు దాఖలు చేశారు. రామాయంపేట మున్సిపాలిటీలో 12 వార్డులకు 118 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ నుంచి 39, బీఆర్ఎస్ నుంచి 31, బీజేపీ నుంచి 27, ఇండిపెండెంట్లు 20 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
తూప్రాన్ మున్సిపాలిటీలోని 16 వార్డులకు మొత్తం 141 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ నుంచి 35, బీఆర్ఎస్ నుంచి 56, బీజేపీ నుంచి 23, బీఎస్పీ నుంచి ఒకటి, ఇండిపెండెంట్లు 22 నామినేషన్లు దాఖలు చేశారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో 15 వార్డులకు మొత్తం 138 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ నుంచి 40, బీఆర్ఎస్ నుంచి 31, బీజేపీ నుంచి 37, బీఎస్పీ నుంచి 2, ఏఐఎంఐఎం నుంచి ఒకటి, ఇండిపెండెంట్లు 20 నామినేషన్లు దాఖలయ్యాయి.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 655 నామినేషన్లు దాఖలు కాగా చివరి రోజు 433 నామినేషన్లు వేశారు. జిల్లాలోని చేర్యాల, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక మున్సిపాలిటీల్లోని 72 వార్డులకు సంబంధించి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. చేర్యాల మున్సిపాలిటీలో12 వార్డులకు మొత్తం 85 నామినేషన్లు దాఖలు కాగా బీఎస్సీ 1, బీజేపీ 13, సీపీఎం 1, కాంగ్రెస్ 31, బీఆర్ఎస్ 26, ఇండిపెండెంట్లు9, రిజిస్టర్ పార్టీల తరపున మూడు నామినేషన్లు దాఖలయ్యాయి.
గజ్వేల్ మున్సిపాలిటీలో 20 వార్డులకు మొత్తం 186 నామినేషన్లు దాఖలు కాగా బీఎస్పీ 1, సీపీఎం1, బీజేపీ 40, కాంగ్రెస్ 53, బీఆర్ఎస్ 52, ఇండిపెండెంట్లు 21, రిజిస్టర్ పార్టీల తరపున 4 నామినేషన్లు దాఖలయ్యాయి. హుస్నాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులకు149 నామినేషన్లు దాఖలు కాగా బీఎస్పీ 6, బీజేపీ 33, కాంగ్రెస్ 39, బీఆర్ఎస్39, ఇండిపెండెంట్లు 21, సీపీఐ 5, జనసేన 5, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున ఒక్క నామినేషన్ దాఖలైంది.
దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డులకు మొత్తం 235 నామినేషన్లకు బీజేపీ 45, బీఎస్పీ1, సీపీఎం 6, కాంగ్రెస్ 56, బీఆర్ఎస్57, ఇండిపెండెంట్లు62, రిజిస్టర్ పార్టీల తరపున 8 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన నామినేషన్ ప్రక్రియను కలెక్టర్ హైమావతి, జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు అయేషా మస్రత్ ఖాన్ తో కలిసి పరిశీలించగా దుబ్బాకలో సీపీ రష్మీ పెరుమాల్ పర్యటించారు.
