రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ రోజు 1,11,178 టెస్టులు నిర్వహించగా.. 3,557 మందికి పాజిటివ్ నిర్థారణ అయింది. 1773మంది వైరస్ బారి నుంచి కోలుకోగా.. ముగ్గురు చనిపోయారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1474 మందికి వైరస్ సోకగా.. మేడ్చల్ మల్కాజ్గిరిలో 321, రంగారెడ్డిలో 275, హనుమకొండలో 130, సంగారెడ్డిలో 123, ఖమ్మంలో 104మంది కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.57 శాతంగా, రికవరీ రేటు 96.06శాతంగా ఉంది. తెలంగాణలో 24,253 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మరిన్ని వార్తల కోసం..

గజ్వేల్ ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి

84 మంది ట్రైనీ ఐఏఎస్లకు కరోనా