హనుమకొండ కలెక్టరేట్/ ములుగు/ కాశీబుగ్గ, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కు అర్జీదారులు పోటెత్తారు. హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన దాదాపు 365 మంది కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ కి అర్జీలు అందజేశారు. ములుగు ప్రోగ్రామ్‌లో మొత్తం 64 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ బోర్ఖడే హేమంత్‌సహదేవరావు తెలిపారు. అదేవిధంగా కలెక్టరేట్ లో జరిగిన పల్స్ పోలియో, స్టాప్ డయేరియా క్యాంపెయిన్, జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు.
వరంగల్ కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌కు 209 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. అనంతరం నక్షా అమలు, భూ రికార్డుల నవీకరణ, క్షేత్రస్థాయి పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో ఆమె పాల్గొన్నారు.
