ఆదిలాబాద్​లో భారీగా మద్యం పట్టివేత .. రూ.1.8 లక్షల మద్యం,7 వాహనాలు స్వాధీనం

ఆదిలాబాద్​లో భారీగా మద్యం పట్టివేత .. రూ.1.8 లక్షల మద్యం,7 వాహనాలు స్వాధీనం

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా మద్యం పట్టుబడింది. సీసీఎస్ ఇన్​స్పెక్టర్ డి.సాయినాథ్, వన్​టౌన్, టూ టౌన్​సీఐలు​సత్యనారాయణ, అశోక్​టీమ్​లుగా ఏర్పడి నిర్వహించిన తనిఖీల్లో రూ.లక్షా 80 వేల విలువైన మద్యం సీసాలతో పాటు 7 వెహికల్స్​ను స్వాధీనం చేసుకున్నట్లు వారు చెప్పారు. రవితేజ హోటల్ సమీపంలో తలమడుగుకు చెందిన అరుణ్ రాజ్ అనే వ్యక్తి వద్ద రూ.72 వేలు విలువ చేసే 395 మద్యం బాటిళ్లు, కలెక్టర్ చౌక్ లో నేరడిగొండకు చెందిన ఆడెపు రమేశ్ అనే వ్యక్తి వద్ద రూ.30 వేల విలువైన 73 మద్యం సీసాలతోపాటు నందు నాగేందర్

దివాకర్ అనే వ్యక్తుల వద్ద రూ11 వేల 500 విలువచేసే 46 బాటిల్స్, తిరుపల్లి చౌరస్తా వద్ద గోనె చిన్నయ్య వద్ద రూ.15,350 విలువ చేసే 48 బాటిళ్లు, రైల్వే స్టేషన్ సమీపంలో అనుకుంట గ్రామానికి చెందిన పల్లెపు రవి వద్ద రూ.18 వేల విలువైన 25 మద్యం, ఎల్మ ఉపేందర్ వద్ద రూ.8,000 విలువ చేసే 44 మద్యం బాటిళ్లు, వినాయక్ చౌక్ వద్ద దిపాయిగూడకు చెందిన గెడం ప్రపుల్ వద్ద రూ.21 వేల విలువైన 16 బాటిళ్లు, బస్టాండ్ సమీపంలో జైనథ్​మండలానికి చెందిన సాయికృష్ణ వద్ద రూ.3,800 విలువ చేసే 18 సీసాలు లభించినట్లు పేర్కొన్నారు. వన్​టౌన్​స్టేషన్​పరిధిలో 7 కేసులు నమోదు చేసి పలువురిని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. 

బెల్లంపల్లిలో రూ.56 వేల మద్యం సీజ్

బెల్లంపల్లి :  బెల్లంపల్లి పట్టణంలో పోలీసులు రూ.56 వేల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. వన్ టౌన్ ఇన్ స్పెక్టర్ బన్సీలాల్ తెలిపిన కథనం ప్రకారం.. రాత్రి 8 గంటల సమయంలో పాత బస్ స్టాండ్ ఏరియా వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా రాంనగర్ కు చెందిన సొగల రాజేశం, కంది మల్లేశ్ అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ. 56 వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.