
జార్ఖండ్లో అయిదు విడతల ఎన్నికల్లో భాగంగా ఈ రోజు మూడో విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 8 జిల్లాల్లోని 81 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 17 అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 17 స్థానాల కోసం మొత్తం 309 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇందులో 32 మంది మహిళా అభ్యుర్థులుండటం విశేషం.
జార్ఖండ్లో మొదటి విడత ఎన్నికలు నవంబర్ 30, రెండో విడత ఎన్నికలు డిసెంబర్ 7వ తేదీన జరిగాయి. నాలుగో విడత మరియు అయిదో విడత ఎన్నికలు వరుసగా డిసెంబర్ 16, డిసెంబర్ 20వ తేదీలలో జరగనున్నాయి. అన్ని విడతల్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత డిసెంబర్ 23వ తేదీన ఫలితాలు విడుదల చేస్తారు.