హైదరాబాద్​లో 4 బిగ్ హలో స్టోర్లు

హైదరాబాద్​లో 4 బిగ్ హలో స్టోర్లు

హైదరాబాద్, వెలుగు: ఎక్కువ ఎత్తు, లావున్న(ప్లస్-సైజ్) వారి కోసం దుస్తులు తయారు చేసే ప్రత్యేక ఫ్యాషన్ బ్రాండ్ బిగ్ హలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో బుధవారం నాలుగు కొత్త స్టోర్లను ప్రారంభించింది. కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి, ఉప్పర్‌‌‌‌‌‌‌‌పల్లి, మియాపూర్,  పంజాగుట్టలో ఇవి ఉన్నాయి.  ప్లస్-సైజ్ పురుషులు,  మహిళల కోసం స్టైలిష్,  హై-క్వాలిటీ దుస్తులను, యాక్సెసరీలను ఇక్కడ కొనుక్కోవచ్చని బిగ్​హలో తెలిపింది.

  ఈ నాలుగు స్టోర్ల ప్రారంభంతో, బిగ్ హలో బెంగళూరు, చెన్నై, విజయవాడతోపాటు  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో విస్తరించింది. తన ఫిజికల్ రిటైల్ స్టోర్‌‌‌‌‌‌‌‌ల మొత్తం సంఖ్యను 11కి పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఎనిమిది అదనపు స్టోర్‌‌‌‌‌‌‌‌లను ప్రారంభించాలని యోచిస్తోంది.