సింగిల్‌‌‌‌ డోస్‌‌‌‌ వ్యాక్సిన్‌‌‌‌ కూడా తీసుకోలేదు

సింగిల్‌‌‌‌ డోస్‌‌‌‌ వ్యాక్సిన్‌‌‌‌ కూడా తీసుకోలేదు

న్యూఢిల్లీ: దేశంలో వైరస్‌‌‌‌ కట్టడికి ఒకపక్క వ్యాక్సినేషన్‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌ స్పీడ్‌‌‌‌గా జరుగుతుంటే, దాదాపు 4 కోట్ల మంది అర్హులు ఇప్పటివరకు సింగిల్‌‌‌‌ డోస్‌‌‌‌ వ్యాక్సిన్‌‌‌‌ కూడా తీసుకోలేదు. శుక్రవారం ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్‌‌‌‌ పవార్‌‌‌‌‌‌‌‌ లోక్‌‌‌‌సభలో వెల్లడించారు. జులై 18 వరకు ప్రభుత్వ కొవిడ్‌‌‌‌ వ్యాక్సినేషన్‌‌‌‌ సెంటర్ల (సీవీసీ)లో 1,78,38,52,566 (97.34%) డోసుల వ్యాక్సిన్‌‌‌‌ వేశామని తెలిపారు. దేశంలో వ్యాక్సినేషన్‌‌‌‌ ప్రారంభం అయినప్పటి నుంచి జులై 18 వరకు 4 కోట్ల మంది కనీసం సింగిల్‌‌‌‌ డోస్‌‌‌‌ వ్యాక్సిన్‌‌‌‌ కూడా తీసుకోలేదని వ్యాక్సినేషన్‌‌‌‌పై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. ఈ ఏడాది మార్చి 16 నుంచి సీవీసీల్లో హెల్త్‌‌‌‌ కేర్‌‌‌‌‌‌‌‌ వర్కర్లు, ఫ్రంట్‌‌‌‌లైన్‌‌‌‌ వర్కర్లు, 60 ఏండ్లు పైబడిన వారికి ఉచితంగా ప్రికాషన్‌‌‌‌ డోసును అందుబాటులో ఉంచామన్నారు. 

మూడో రోజూ 20 వేలకు పైగా..

దేశంలో మూడో రోజు కూడా కరోనా కేసులు 20 వేలు దాటాయి. కొత్తగా 21,411 మంది వైరస్‌‌‌‌ బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసులు 4.38 కోట్లకు పైగా పెరిగాయని శనివారం హెల్త్‌‌‌‌ మినిస్ట్రీ వెల్లడించింది. యాక్టివ్‌‌‌‌ కేసులు 1,50,100కు పెరిగాయి.  వైరస్‌‌‌‌తో మరో 67 మంది చనిపోయారు.