
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న కారు బిక్కనూరు మండలం జంగంపల్లి దగ్గర చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహిళతో పాటు నలుగురు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కారును గ్యాస్ కట్టర్ తో కట్ చేసి మృతదేహాలను బయటకు తీశారు మృతులంతా నిజామాబాద్ జిల్లా నవీబ్ పేట వాసులుగా గుర్తించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మృత దేహాలను పోస్ట్‌మార్టం కోసం కామారెడ్డి హాస్పిటల్‌కు తరలించారు పోలీసులు.