వంగమర్తిలో బిడ్డతో కలిసి బావిలో దూకింది!..తల్లి మృతి..పాప కోసం గాలింపు

వంగమర్తిలో బిడ్డతో కలిసి బావిలో దూకింది!..తల్లి మృతి..పాప కోసం గాలింపు
  • నల్గొండ జిల్లా వంగమర్తిలో ఘటన

శాలిగౌరారం (నకిరేకల్), వెలుగు : బిడ్డతో కలిసి బావిలో దూకి తల్లి చనిపోయిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది.  పోలీసుల తెలిపిన ప్రకారం..  శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామానికి చెందిన సింగారపు వాణి(25)తో రామన్నపేట మండలం ఎన్నారం గ్రామానికి చెందిన మహేశ్​తో పెండ్లి అయింది.   వాణికి డెలివరీ సమయంలో అనారోగ్య సమస్యలు వచ్చాయి. 

అప్పటి నుంచి ఆమె మానసిక పరిస్థితి సరిగాలేదు. గతంలో వాణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెనుతల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకెళ్లారు. కాగా.. వాణి తన 8 నెలల పాపతో కలిసి శనివారం ఉదయం బావిలో దూకింది. మధ్యాహ్నం తల్లిదండ్రులు గుర్తించి వాణి డెడ్ బాడీని వెలికితీశారు. రాత్రి వరకు పాప కోసం గాలించినా ఆచూకీ దొరకలేదని పోలీసులు తెలిపారు.