ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు.. భర్తను గొంతు పిసికి చంపేసింది

 ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు.. భర్తను గొంతు పిసికి చంపేసింది
  • అనంతరం మద్యం మత్తులో చనిపోయాడని నమ్మించింది
  • మెడపై గాయాలు ఉండడంతో బయటపడ్డ బాగోతం
  • నిందితురాలు అరెస్ట్

జీడిమెట్ల, వెలుగు: మద్యం మత్తులో ఉన్న భర్తను గొంతు నులిమి హత్య చేసిన మహిళను బాచుపల్లి పోలీసులు రిమాండ్​కు తరలించారు. నారాయణపేట​ జిల్లా రామకృష్ణయ్య పల్లికి చెందిన అంజిలప్ప(45), రాధ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా, ఉపాధి కోసం మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లికి వలస వచ్చారు. రాధ తరచూ తన ప్రియుడితో ఫోన్​లో మాట్లాడుతుండడంతో భర్త పలుమార్లు మందలించాడు. ఇదే విషయమై జూన్​22న మద్యం మత్తులో భార్యతో గొడవ పడ్డాడు. 

దీంతో తన భర్తను రాధ గొంతునులిమి హత్య చేసింది. అనంతరం అతిగా మద్యం తాగి చనిపోయాడని అందరినీ నమ్మించి స్వగ్రామానికి తీసుకెళ్లింది. అక్కడ మృతుడి గొంతుపై గాయాలు ఉండడంతో అంజిలప్ప సోదరుడు నారాయణపేట​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసును బాచుపల్లి పోలీసులకు బదిలీ చేయగా, నిందితురాలు రాధను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అసలు విషయం బయటపడడంతో శనివారం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్​ చేశారు.