Food Alert : ఈ నాలుగు ఆహార పదార్థాలను కోడి గుడ్డుతో కలిపి అస్సలు తినొద్దు

Food Alert : ఈ నాలుగు ఆహార పదార్థాలను కోడి గుడ్డుతో కలిపి అస్సలు తినొద్దు

సండే అయినా.. మండే అయినా.. ప్రతిరోజూ తినండి గుడ్లు’ అని యాడ్ లలో ప్రతీ రోజూ చూస్తూనే ఉంటాం. గుడ్లు సంపూర్ణ ఆహారం అయినప్పటికీ వీటిని ఎలా తినాలో సరైన మార్గం తెలిసి ఉండాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.అంటే గుడ్డును వేటితో తినాలి.. వేటితో కలిపి తినకూడదు వంటి విషయాలు తెలియాలి. ఎందుకంటే గుడ్డును కొన్ని రకాల ఆహార పదార్థాలతో తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.    గుడ్లతో తినకూడని  పదార్ధాలను ఇప్పుడు తెలుసుకుందాం. . . 

ఈ ప్రపంచంలో మనిషికి అత్యవసరమైన తొమ్మిది ప్రోటీన్లు గుడ్డులోనే ఉన్నాయి. అందుకే గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు. మనలో చాలా మందికి గుడ్డుతో చేసే వంటలు అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ప్రొటీన్లు అధికంగా ఉండే గుడ్డు కండరాలను బలపరచడమే కాదు.. ఇందుకు బదులుగా, ఇది గుండె పనితీరుకు మద్దతు ఇస్తుంది. మనం తీసుకున్న ఆహారంలో ఒక్క గుడ్డుకు మాత్రమే బయోలాజికల్ విలువ నూటికి నూరు శాతం విలువ ఉంటుంది. ఒక గ్రాము మాంసకృత్తులు శరీరానికి ఎంత బరువు ఇవ్వగలదనేది ప్రోటీన్లు ఎఫిషియెన్సీ రేషియో అంటారు. ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ గుడ్లలో ఉంటాయి. దీనిని తీసుకోవడం ద్వారా శరీరంలో శక్తిని అందిస్తుంది.  రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే గుడ్లు సరిగ్గా తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో, మీరు గుడ్లుతో కొన్ని పదార్థాలను తినకూడదు. 

సోయా పాలు

సోయా పాలు మొక్కల ఆధారిత ప్రోటీన్.. ఇంది ఆరోగ్యానికి చాలా మంచి ఉత్తమైన మూలం. పొరపాటున కూడా గుడ్లతో కలిపి తినకూడదు. ఎందుకంటే ఈ రెండు పదార్థాలను కలిపి తినడం వల్ల శరీరంలో ప్రొటీన్లు వేగంగా పెరుగుతాయి. మీరు అనేక ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలను కలిగి ఉండవచ్చు.  పాలు,  గుడ్లను కలిపి తింటే వీటి కలయిక  బయోటిన్ లోపంతో  ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది. కాబట్టి మీరు ఈ రెండింటినీ కలిపి తినకుండా ఉండాలి.

చాయ్..

ర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం చాయ్‌ లేదా టీ కలిపి ఎప్పుడూ తినకూడదు. ఎందుకంటే ఈ ఫుడ్ కాంబినేషన్ మలబద్ధకం వస్తుంది. అంతేకాదు గ్యాస్, అసిడిటీని కలిగిస్తుంది. ఎందుకంటే టీతో పాటు గుడ్లు తింటే శరీరంలో ప్రొటీన్లు  17 శాతం తగ్గుతాయి, టీలో ఉండే ఫాలీ ఫెనాల్స్ .. గుడ్దులోని  ప్రోటీన్లను  శరీరానికి చేరకుండా అడ్డుకుంటాయి, కాబట్టి, ఈ రెండింటినీ కలిపి తినడం మానుకోవాలి

చక్కెర

గుడ్డు తిన్న తర్వాత చక్కెర తిన్నా, చక్కెర, గుడ్డు కలిపి వండిన ఆహారం తీసుకుంటే.. మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ రెండూ కలిపి తింటే.. రెండిటి నుంచి విడుదలయ్యే.. అమైనో యాసిడ్స్‌ మానవ శరీరానికి హానికలిగిస్తాయి. గుడ్డు, చక్కెర కలిపి తింటే రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంది.

మాంసం

గుడ్డుతో కలిపి మాంసం తింటే చాలా ఇబ్బందులు వస్తాయంటున్నారు నిపుణులు.  సహజంగా గుడ్లలో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.  వీటిని ఇతర పదార్ధాలతో కలిపి తింటే శరీరానికి చాలా హాని కలిగిస్తాయి.  మాంసంలో కూడా ప్రోటీన్లు ఉంటాయి.  మాంసాన్ని, గుడ్లను కలిపి తింటే శరీరానికి  కావలసిన దానికంటే ఎక్కువ పోషకాలు చేరి జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ఇది ఒక్కొక్కసారి శ్వాస అందక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.  కాబట్డి గుడ్డుతో.. మాంసాన్ని కలిపి తినే అలవాటు ఉంటే తక్షణమే మానుకోండి.