ఒక్కరోజే 4 లక్షల కేజీల చికెన్, 30 వేల క్వింటాళ్ల మటన్ లాగించిర్రు

ఒక్కరోజే 4 లక్షల కేజీల చికెన్, 30 వేల క్వింటాళ్ల మటన్ లాగించిర్రు
  •     సండే, డిసెంబర్‌‌ 31 కావడంతో నాన్‌వెజ్ షాపుల వద్ద భారీ క్యూ 
  •         ఖర్చుకు వెనకాడని సిటీ జనం 
  •         రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని తెలిపిన ఫౌల్ట్రీ రంగ నిపుణులు 

హైదరాబాద్,వెలుగు: గతేడాదికి వీడ్కోలు తెలుపుతూ..  నయా సాల్‌కు   స్వాగతం పలుకుతూ సిటీ జనాలు ఎంజాయ్‌ చేశారు.  నాన్ వెజ్ వంటలకు ఇంట్రెస్ట్ చూపి.. ఇయర్ ఎండింగ్ సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు.  2023, డిసెంబర్ 31 చివరి రోజు ఆదివారం రావడంతో  సిటీలో ఎక్కడ చూసినా ఉదయం 7 గంటల నుంచే మటన్, చికెన్​, చేపల షాపుల వద్ద భారీగా క్యూ కనిపించింది. గ్రేటర్​ సిటీలో సాధారణ రోజుల్లో కంటే సండే ఒక్కరోజే నాన్​వెజ్​అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇవి గత రికార్డులను బ్రేక్ చేశాయి. కొత్త ఏడాదిని మస్తుగా ఎంజాయ్​ చేసేందుకు అధికశాతం నాన్​వెజ్​ప్రియులు ఫుడ్​కే ప్రిపరెన్స్ ఇచ్చారు. 

దీంతో పెద్ద మొత్తంలో నాన్ వెజ్ అమ్మకాలు కొనసాగాయి. సాధారణ రోజుల్లో రోజుకు 3 లక్షల కేజీల చికెన్​అమ్ముడుపోతుండగా.. ఒక్కరోజే 4.5 లక్షలు కొనుగోలు చేసినట్లు వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం చికెన్​అమ్మకాలకు మంచి వాతావరణం ఉందని, అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.  4.5 లక్షల కేజీలకు కిలోకు రూ. 230  చొప్పున 10.35 కోట్ల బిజినెస్ జరిగిందని పౌల్ట్రీరంగ నిపుణులు, నేషనల్​ఎగ్​కోఆర్డినేషన్​ కమిటీ(నెక్​) వైస్​ప్రెసిడెంట్​ సుబ్బరాజు పేర్కొన్నారు. 

మటన్ కూడా  రికార్డు స్థాయిలో అమ్ముడు పోయింది.  దాదాపు 25 నుంచి 30  వేల క్వింటాళ్ల మటన్ అమ్మకాలు జరిగాయి. మటన్​ధర ప్రస్తుతం రిటైల్​మార్కెట్​లో కిలో రూ. 800 – రూ. 900 వరకు పలుకుతుండగా.. అయినా వెనుకాడకుండా కొనుగోలు చేసినట్టు రామ్​నగర్​కు చెందిన మటన్ హోల్​సేల్​వ్యాపారి ఖలీద్​ పాషా తెలిపారు. రామ్​నగర్​, జియాగూడ, సికింద్రాబాద్​ మోండా మార్కెట్​లోనూ ఫిష్​ విక్రయాలు భారీగానే చేసినట్టు, 2 వేల క్వింటాళ్ల వరకు అమ్ముడుపోయినట్టు హోల్​సేల్​ వ్యాపారి రాజేందర్​రెడ్డి తెలిపారు. 

మొత్తానికి న్యూఇయర్​ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు సిటీవాసులు ఖర్చుకు వెనుకాడలేదు. ఉదయం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ హ్యాపీ న్యూ ఇయర్​సెలబ్రేషన్స్ పిల్లలు, పెద్దలు, యూత్ , ఫ్యామిలీస్ అంతా కలిసి జోష్ చేశారు. హోటళ్లు, పబ్​లు,క్లబ్బులు, రిసార్ట్ ల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.