డిసెంబర్ 16న 4 సినిమాలు విడుదల

డిసెంబర్ 16న 4 సినిమాలు విడుదల

ఈ వీకెండ్.. సినిమా ఆడియన్స్ కి పండగే. హాలీవుడ్ ఆడియన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయి. ఈ శుక్రవారం (16న) నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదలకాబోతున్నాయి.   

జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ ‘అవతార్-ది వే ఆఫ్ వాటర్’ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో సామ్ వర్దింగ్టన్, జోయా సాల్దానా, సిగుర్నే వీవర్, కేట్ విన్స్ లెట్ ప్రధాన పాత్రలో నటించారు. 

వేణు మడికంటి దర్శకత్వం వహించిన పాన్ ఇండియా సినిమా ‘శాసనసభ’. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఇంద్రసేన్, ఐశ్వర్యరాజ్ జంటగా నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్ కీలక పాత్ర పోషించారు.

తమిళ నటుడు అరుణ్ విజయ్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘ఆక్రోశం’. హీరోయిన్ గా పలక్ లాల్వానీ నటించింది. జీఎన్ఆర్ కుమరవేలన్ దర్శకత్వం వహించాడు.

ఎన్ ఎస్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పసిడి ప్రాణం’. లైవ్ కమ్ యానిమేటెడ్ టెక్నాలజీతో, టాలీవుడ్ లో మొదటి మోషన్ క్యాప్చర్ సినిమా ఇదే. ఈ సినిమాతో అల్లు వంశీ, ఇతి ఆచార్య హీరో-హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో  సీరియల్ నటి సుజిత కీలక పాత్ర పోషిస్తున్నారు.