
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇద్ధరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.27 లక్షల విలువైన 8 వందల గ్రాములకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రియాజ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి డ్రిల్లింగ్ మిషన్ లో కడ్డీ రూపంలో అక్రమంగా తరలిస్తున్న 600 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడిని అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు.. సిల్వర్ పూత పూసిన బంగారు ప్లేట్ ను స్వాధీనం చేసుకున్నారు. 220 గ్రాముల బరువున్నట్లు అధికారులు గుర్తించారు. దాని విలువ రూ.7 లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ రవి అధ్వర్యంలో అధికారులు ఈ సోదాలు నిర్వహించి బంగారం పట్టుకున్నారు.